తొలి రౌండ్‌లోనే కశ్యప్‌ ఓటమి 

29 Nov, 2018 01:31 IST|Sakshi

గ్వాంగ్జూ (కొరియా): వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 కొరియా ఓపెన్‌లో భారత షట్లర్లకు చుక్కెదురైంది. స్టార్‌ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్‌ వర్మ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కశ్యప్‌ 17–21, 21–13, 8–21 లీ డాంగ్‌ క్యూన్‌ (కొరియా) చేతిలో... సౌరభ్‌ వర్మ 13–21, 21–12, 18–21తో ఈటూ హియానో (ఫిన్లాండ్‌) చేతిలో ఓడారు. గంటా 19 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో కశ్యప్‌ తొలి రెండు గేమ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసినా... మూడో గేమ్‌లో పూర్తిగా తడబడి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయాడు.    

మరిన్ని వార్తలు