మూడు వరల్డ్‌కప్‌ల విన్నర్‌ క్రికెట్‌కు గుడ్‌ బై

17 Dec, 2019 12:41 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ లౌరా మార్ష్‌ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. తన సుదీర్ఘ 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఆమె ఇంగ్లండ్‌ సాధించిన చిరస్మరణీయమైన విజయాలు పాలుపంచుకున్నారు. 2006లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన లౌరా మార్ష్‌.. ప్రధానంగా 2009 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టులో కీలక పాత్ర పోషించారు. ఆ మెగా టోర్నీలో 16  వికెట్లతో లీడింగ్‌ వికెట్‌  టేకర్‌గా నిలిచారు. అదే ఏడాది జరిగిన వరల్డ్‌ టీ20ని ఇంగ్లండ్‌ గెలవగా మార్ష్‌ ఆ జట్టులో సభ్యురాలు.

ఇక 2017లో ఇంగ్లండ్‌ మహిళలు గెలిచిన వన్డే వరల్డ్‌కప్‌లో కూడా మార్ష్‌ భాగమమయ్యారు.  103 వన్డేలు, 67 టీ20లతో పాటు 9 టెస్టులు ఆడిన మార్ష్‌ ఓవరాల్‌గా 217 వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌  చరిత్రలో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ స్పిన్నర్‌గా నిలిచిన మార్ష్‌..  ఇంగ్లండ్‌ తరఫున వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్ల జాబితాలో ఆమె మూడో స్థానంలో ఉన్నారు. లౌరా మార్ష్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పడంపై ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ డైరక్టర్‌ క్లార్‌ కానోర్‌  స్పందించారు. క్రికెట్‌ చరిత్రలో లౌరా రికార్డులే ఆమె అంకిత భావాన్ని చూపెడతాయన్నారు. లౌరాతో ఆడిన క్రికెటర్లందరికీ ఆమె ఎంతలా శ్రమిస్తారో తెలుసని అన్నారు. దాంతోపాటు నిజాయితీ, దయాగుణం, నేర్చుకోవాలనే తపన ఆమెను ఉన్నత స్థానంలో నిలబెట్టాయన్నారు.

మరిన్ని వార్తలు