వార్నర్‌ నోట ‘పోకిరి’ డైలాగ్‌

10 May, 2020 14:30 IST|Sakshi

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ వరుస టిక్‌టాక్‌లతో దుమ్మలేపుతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ లెఫ్టాండ్‌ బ్యాట్స్‌మన్‌ తన కుటుంబ సభ్యులతో కలసి ఫన్నీ వీడియోలను రూపొందిస్తున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరుపున ప్రాతినథ్యం వహిస్తున్న వార్నర్‌ టాలీవుడ్‌తో మంచి అటాచ్‌మెంట్‌ ఉంది. దీంతో ఇప్పటికే పలు దక్షిణాది పాటలకు టిక్‌టాక్‌ వీడియోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

మొన్న బుట్టబొమ్మ.. నిన్న సన్నజాజి.. నేడు పోకిరి డైలాగ్‌
‘అల.. వైకుంఠపురుములో’చిత్రంలోని సూపర్‌డూపర్‌ సాంగ్‌ బుట్టబొమ్మకు వార్నర్‌ తన సతీమణి క్యాండీస్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఆ వీడియో నెట్టింట ఎంత వైరల్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత తమిళ సాంగ్‌ సన్నజాజికి డ్యాన్స్‌ చేశాడు. తన భార్య తో కలిసి సన్నజాజికి టిక్‌టాక్‌ చేశాడు. ముందు వరుసలో కూతురు ఉండగా, వెనకాల వార్నర్‌-క్యాండీస్‌లు జంటగా కాలు కదిపారు. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సంచలన చిత్రం ‘పోకిరి’ సినిమాలోని పవర్‌ఫుల్‌ డైలాగ్‌కు వార్నర్‌ టిక్‌టాక్‌ చేశాడు. ‘ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను’ అంటూ వార్నర్‌ చేసిన టిక్‌టాక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 


చదవండి:
మే 9 వెరీ స్పెషల్‌ డే ఎందుకంటే?

వార్నర్‌ కుమ్మేస్తున్నాడుగా..!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు