'ధోనికి ప్రత్యామ్నాయం అతడే'

21 Jan, 2020 14:40 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని భవితవ్యం ఏంటనే దానిపై  దేశ వ్యాప్తంగా అతని అభిమానులు మల్లగుల్లాలు పడుతుంటే , పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఆడే ఐదో స్థానానికి మనీష్‌ పాండే సమర్థవంతుడని పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టును షోయబ్‌ అక్తర్‌ య్యూట్యూబ్‌ వేదికగా అభినందించాడు. ఈ సందర్భంగా అక్తర్‌ తన భావాలను య్యూటూబ్‌ వేదికగా పంచుకున్నాడు.'ఇన్నాళ్లకు  ధోని ఆడే ఐదో స్థానంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ సరైన ఆటగాడిని తీసుకువచ్చిం​ది. నా దృష్టిలో మనీష్‌ పాండే ఐదో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. ధోని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం మనీష్‌కు ఉంది. శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా తన బ్యాటింగ్‌ సామర్థ్యంతో జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడంటూ' తెలిపాడు. (అది భారత్‌కు ఎంతో అవమానకరం: అక్తర్‌)

పనిలో పనిగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. 'విరాట్‌ కోహ్లి మానసికంగా చాలా దృడంగా ఉండగలడు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా మళ్లీ ఎలా పైకి రావాలో అతనికి తెలిసినంతగా ఎవరికి తెలీదు.  తన సాధికారత బ్యాటింగ్‌తో కోహ్లి ఎన్నో సార్లు జట్టును గెలిపించాడు.  ఈ విషయం అతని సహచరులు కూడా ఎన్నో సార్లు ఒప్పుకోవడం జరిగింది. కోహ్లితో పాటు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ లాంటి క్రికెటర్లు ఉన్న టీమిండియాకు బెంగుళూరు పిచ్‌పై 300 పరుగుల లక్ష్యాన్ని చేధించడం పెద్ద విషయం ఏం కాదని' అక్తర్‌ చెప్పుకొచ్చాడు. అలాగే ఆసీస్‌- టీమిండియాల మధ్య జరిగిన సిరీస్‌ను 'బాటిల్‌ ఆఫ్‌ ప్రైడ్‌'గా అభివర్ణించాడు. ( ‘రోహిత్‌.. ఆనాటి మ్యాచ్‌ను గుర్తు చేశావ్‌’)

మరిన్ని వార్తలు