సీఎస్‌కే విజయలక్ష్యం 156

26 Apr, 2019 21:49 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 156  పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-డీకాక్‌లు ఆరంభించారు. అయితే ముంబై ఇండియన్స్‌ స్కోరు 24 పరుగులు వద్ద డీకాక్‌(15) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అటు తర్వాత రోహిత్‌-లూయిస్‌లు ఇన‍్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 75 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత లూయిస్‌(32) ఔటయ్యాడు.

ఆపై కాసేపటికి కృనాల్‌ పాండ్యా(1) కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. రోహిత్‌ శర్మ(67; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడగా, చివర్లో హార్దిక్‌ పాండ్యా(23 నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు. పొలార్డ్‌ 12 బంతులు ఆడినప్పటికీ 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబై పరుగులు చేయడానికి అపసోపాలు పడింది. ప్రధానంగా సాంత్నార్‌ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయడమే కాకుండా 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇమ్రాన్‌ తాహిర్‌, దీపక్‌ చాహర్‌లకు తలో వికెట​ దక్కింది.

మరిన్ని వార్తలు