'నేను కెప్టెన్సీ నుంచి తప్పుకోను'

9 Oct, 2017 17:34 IST|Sakshi

కేప్ టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లాదేశ్ వైట్ వాష్ అయిన నేపథ్యంలో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న తాను రాజీనామా చేయాలంటూ వస్తున్న విమర్శలపై ముష్పికర్ రహీమ్ ఘాటుగా స్పందించాడు. తాను ఎట్టిపరిస్థితుల్లోనే కెప్టెన్సీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదంటూ విమర్శలను తిప్పికొట్టాడు.

'నేను రాజీనామా చేయాలంటూ మా క్రికెట్ బోర్డు బీసీబీ ఏమీ కోరలేదు. మా జట్టు చెత్త ప్రదర్శనపై కారణాలు చెప్పాలని అనుకోవడం లేదు. నేను ఎప్పుడూ జట్టును ముందుకు తీసుకువెళ్లడానికే యత్నిస్తున్నా. నేను ముందుండి నడిపిస్తున్నా..కానీ నేను ఒక మనిషినే.. నేను కూడా తప్పులు చేస్తా. అంతేకానీ ప్రతికూల ఫలితాలు వస్తే జట్టు కెప్టెన్సీకి ఎందుకు ఉద్వాసన చెప్పాలి''అని ముష్ఫికర్ ప్రశ్నించాడు.ప్రధానంగా రెండు టెస్టుల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై ముష్ఫికర్ పై విమర్శల వర్షం కురుస్తోంది. తాను చేసింది తప్పంటూ పరోక్షంగా ఒప్పుకుంటూనే సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం కూడా ఇవ్వాలని కోరుతున్నాడు.తొలి టెస్టులో 333 పరుగుల తేడాతో ఓటమి పాలైన బంగ్లాదేశ్.. రెండో టెస్టులో సైతం ఇన్నింగ్స్ 254 పరుగుల భారీ తేడాతో పరాజయం చెందింది.

మరిన్ని వార్తలు