ముస్తాఫిజుర్‌కు షాక్‌!

21 Jul, 2018 14:28 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) షాకిచ్చింది. రెండేళ్ల పాటు విదేశాల్లో జరిగే  టీ20 లీగ్‌లకు దూరంగా ఉండాలని అతనికి ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)తో సహా ఇతర విదేశీ లీగ్‌ల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పాల్గొనకూడదంటూ ముస్తాఫిజుర్‌ను హెచ్చరించింది. విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువగా హాజరవుతున్న ముస్తాఫిజుర్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో అతన్ని రెండేళ్ల పాటు టీ20 లీగ్‌లకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హాసన్ స్పష్టం చేశారు.

‘లీగ్‌లు ఆడటం వల్ల ముస్తాఫిజుర్‌ గాయాల పాలవుతున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని మేం సీరియస్‌గా తీసుకున్నాం. విదేశీ లీగ్‌ల్లో ఆడి గాయాలపాలై స్వదేశానికి వచ్చి బోర్డు ఫిజియోల సమక్షంలో కోలుకుంటున్నాడు. కొద్ది రోజుల ర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లి లీగ్‌లు ఆడి వచ్చి గాయపడుతున్నాడు. దాంతో అతన్ని రెండేళ్లు టీ 20 లీగ్‌లు ఆడొద్దని చెప్పాం. బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ విభాగంలో ముస్తాఫిజుర్‌ ఎంతో కీలకమైన ఆటగాడు. అలాంటివాడిని మేం కోల్పోవడం వల్ల జట్టుకు ఓటములు ఎక్కువవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని ’ అని నజ్ముల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు