పూరన్‌ సస్పెన్షన్‌

14 Nov, 2019 02:06 IST|Sakshi

బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విండీస్‌ క్రికెటర్‌

నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించిన ఐసీసీ

దుబాయ్‌: వెస్టిండీస్‌ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. లక్నోలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో అతను బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్‌ అంగీకరించడంతో క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్‌ కారణంగా విండీస్‌ ఆటగాడు తదుపరి నాలుగు టి20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్‌–3 నిబంధనను అతిక్రమించడంతో ఆరి్టకల్‌ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్‌ పాయింట్లను విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఔను... నా వల్ల తప్పు జరిగింది. ఐసీసీ శిక్షకు నేను అర్హుడినే. భవిష్యత్తులో ఇలాంటి తప్పు పునరావృతం చేయను’ అని పూరన్‌ జట్టు వర్గాలను క్షమాపణలు కోరాడు.  

>
మరిన్ని వార్తలు