కోహ్లిని తప్పుబట్టిన మాజీ క్రికెటర్‌

12 Jun, 2019 13:18 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, స్మిత్‌

లండన్‌ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన భారత అభిమానులను మందలించి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్రీడాస్పూర్తిని చాటుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై యావత్‌ క్రికెట్‌ ప్రపంచం కోహ్లిని కొనియాడగా.. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ నిక్‌ కాంప్టన్‌ మాత్రం తప్పుబట్టాడు. భారత అభిమానులను మందలించే హక్కు కోహ్లికి ఎక్కడిదని ప్రశ్నించాడు. ‘వార్నర్‌, స్మిత్‌లను భారత అభిమానులు తిట్టకుండా ఆపే హక్కు కోహ్లికి ఉందా? వారు తప్పు చేసారు కాబట్టే అభిమానులు అంటున్నారు’ అని అభిప్రాయపడ్డాడు. అయితే నిక్‌ కాంప్టన్‌ కోహ్లిని తప్పుబట్టడాన్ని భారత్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీన్ని గ్రహించిన నిక్‌ కాంప్టన్‌ తన తప్పును సరిదిద్దుకుంటూ క్షమాపణలు తెలియజేసాడు. ‘కోహ్లి పట్ల నేను చేసిన అనాలోచిత వ్యాఖ్యలకు ఎవరైన బాధపడి ఉంటే క్షమించండి. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. కోహ్లి చేసిన పని గొప్పది. వీటన్నిటిని పక్కనపెట్టి  క్రికెట్‌ను ఆస్వాదించండి. మీ అభిప్రాయాలను నేను అభినందిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశాడు.

భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ సందర్భంగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్‌ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్‌, చీటర్‌’ అంటూ అభిమానులు గేలి చేశారు.  కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లి, హార్ధిక్‌ పాండ్యా వికెట్‌ పడ్డ సమయంలో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ... అలా ప్రవర్తించవద్దంటూ మందలించాడు. స్మిత్‌ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. అంతేకాకుండా అభిమానుల తరఫున స్మిత్‌కు క్షమాపణలు కూడా కోరాడు. అభిమానులను కోహ్లి మందలించడాన్ని చూసిన స్మిత్‌.. అభినందన పూర్వకంగా అతనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. కోహ్లి చేసిన ఈ పనిపై ఐసీసీతో పాటు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం హర్షించింది.

చదవండి : మావాళ్ల తరఫున సారీ స్మిత్‌ : కోహ్లి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

ఫైనల్లో పరాజితులు లేరు 

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు