బెన్‌ స్టోక్స్‌ మరీ ఇంత ‘చీప్‌ షాట్‌’ కొడతావా!

18 Nov, 2019 14:14 IST|Sakshi

బ్రిస్బేన్‌:  ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రాసిన ఆన్‌ ఫైర్‌ పుస్తకంపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా  ఈ ఏడాది జరిగిన యాషెస్‌ సిరీస్‌ను తన రాసిన పుస్తకంలో ఉదహరించడమే కాకుండా ఆసీస్‌ క్రికెటర్లను టార్గెట్‌ చేశాడు. స్టోక్స్‌ రాసిన బుక్‌లో డేవిడ్‌ వార్నర్‌ పేరును ప్రముఖంగా ప్రస్తావించడంతో వివాదం పెద్దదిగా మారింది. యాషెస్‌ సిరీస్‌లో వార్నర్‌ ఎప్పుడూ స్లెడ్జింగ్‌ చేస్తూనే ఉన్నాడని, ఏ సమయంలోనూ తన నోటిని కట్టిపెట్టిన సందర్భం లేదంటూ స్టోక్స్‌ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. ఈ పుస్తకాన్ని సంబంధించిన పేజీలు ఒక్కొక్కటిగా బ్రిటీష్‌ న్యూస్‌ పేపర్‌లో రావడం, అందులో వార్నర్‌ పేరునే  ప్రధానంగా పేర్కొనడంతో ఆసీస్‌ క్రికెట్‌లో అలజడి రేగింది.

దీనిపై యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న టీమ్‌ పైన్‌ స్పందించడమే కాకుండా స్టోక్స్‌ చిల్లర వేషాలు వేస్తున్నాడంటూ విమర్శించాడు. ‘ ఇది స్టోక్స్‌ చీప్‌ ట్రిక్‌.. చీప్‌ షాట్‌. అతని పుస్తకాల్ని సేల్‌ చేసుకోవడం కోసం చేసిన చిల్లర పని. వార్నర్‌ పేరును రాసి వివాదం సృష్టిస్తే పుస్తకాలు అమ్మకాలు వేగంగా జరుగుతాయనే స్టోక్స్‌ భావించాడు. అంతేకానీ అందులో వాస్తవం లేదు. యాషెస్‌ సిరీస్‌లో వార్నర్‌ ఎక్కువ సేపు నా పక్కనే ఉన్నాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లను స్లెడ్జింగ్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడంటూ స్టోక్స్‌ బుక్‌లో పేర్కొనడంలో నిజం లేదు. ఇదంతా బుక్‌పై ఒక హైప్‌ క్రియేట్‌ చేయడం కోసమే స్టోక్స్‌ చేశాడు’ అని పైన్‌ పేర్కొన్నాడు.

మరొకవైపు స్లెడ్జింగ్‌ చేయడం అనేది ఇంగ్లండ్‌ క్రికెట్‌లో భాగమే అయినప్పుడు దాని కోసం స్టోక్స్‌ దాన్నే ఎందుకు ప్రస్తావించాడో చెప్పాలన్నాడు. స్లెడ్జింగ్‌ అనేది ఇంగ్లండ్‌ క్రికెట్‌లో కామన్‌ ట్రెండే కదా.. మరి ఎందుకో ఆ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించినట్లు అని పైన్‌ కౌంటర్‌ అటాక్‌ చేశాడు.  బుక్స్‌ను సాధ్యమైనంత త్వరగా అమ్మేసుకుని మార్కెట్‌ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వార్నర్‌ స్లెడ్జింగ్‌ చేశాడంటూ స్టోక్స్‌ తన పుస్తకంలో రాసుకున్నాడన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు