పాకిస్తాన్‌ టాస్‌ గెలిచిందోచ్‌!

5 Jul, 2019 14:42 IST|Sakshi

లండన్‌:  ప్రస్తుత వరల్డ్‌కప్‌లో పడుతూలేస్తూ సాగిన పాకిస్తాన్‌ పయనం.. ఏడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలుపొందడంతో గాడిన పడింది. ఆ మ్యాచ్‌ నాటికి అచ్చం..1992 ప్రపంచకప్‌లో మాదిరి పరిస్థితులు ఏర్పడడంతో అప్పటి లాగానే తాము ట్రోఫీ సాధించగలమని అటు పాకిస్తాన్‌ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులు ఆశల పల్లకిలో ఊరేగారు.( ఇక్కడ చదవండి: 500 చేస్తాం.. పాక్‌ కెప్టెన్‌)

కానీ ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ ఓడడంతో పాక్‌ సెమీస్‌ ఆశలు సన్నగిల్లాయి. ఇక బుధవారంనాటి పోరులో ఆతిథ్య జట్టు చేతిలో న్యూజిలాండ్‌ పరాజయం చవిచూడడంతో సర్ఫ్‌రాజ్‌ సేన నాకౌట్‌ ఆశలు దాదాపు అడుగంటాయి. కానీ సాంకేతికంగా చూస్తే పాకిస్తాన్‌ సెమీస్‌ రేసులో ఉంది. కాకపోతే న్యూజిలాండ్‌ను వెనక్కు నెట్టి నాలుగో స్థానంతో నాకౌట్‌ బెర్త్‌ దక్కించుకొనే లెక్కలే అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. శుక్రవారంనాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్‌ తలపడుతోంది. అందులో మొదటిది.. ఆ జట్టు టాస్‌ గెలవడం. రెండోది.. మొదట బ్యాటింగ్‌ చేయడం. ఇక మూడోది.. 316 పరుగుల తేడాతో గెలవడం. మరి పాకిస్తాన్‌ టాస్‌ గెలిచింది.. తొలుత బ్యాటింగూ ఎంచుకుంది. మరి ఇంతటి భారీ తేడాతో గెలుస్తుందో లేదో చూడాలి.

తుది జట్లు

పాకిస్తాన్‌
సర్ఫరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), ఫకార్‌ జమాన్‌,  బాబర్‌ అజామ్‌, ఇమాముల్‌ హక్‌, మహ్మద్‌ హఫీజ్‌, హరీస్‌ సొహైల్‌, ఇమాద్‌ వసీం, షాదబ్‌ ఖాన్‌, వహాబ్‌ రియాజ్‌, మహ్మద్‌ అమిర్‌, షాహిన్‌ అఫ్రిది

బంగ్లాదేశ్‌
మష్రాఫ్‌ మొర్తజా(కెప్టెన్‌), సౌమ్య సర్కార్‌, తమీమ్‌ ఇక్బాల్‌, షకీబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్మదుల్లా, లిటాన్‌ దాస్‌, మొసదెక్‌ హుస్సేన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, మెహిదీ హసన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌


 

మరిన్ని వార్తలు