రషీద్‌ ఖాన్‌ Vs వాట్సన్‌.. పేలుతున్న జోకులు!

24 Apr, 2019 11:31 IST|Sakshi

చెన్నై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్బుత ఇన్నింగ్స్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై 6 వికెట్లతో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోపాటు ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ను కాయం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ పూర్తిగా తెలిపోయాడు. వాట్సన్‌ దాటికి ఎన్నడు లేని విధంగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన రషీద్‌ వాట్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీదికి దూసుకెళ్లాడు. దీనికి వాట్సన్‌ కూడా అదే తరహాలో ప్రతిఘటించడంతో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. కానీ ఇద్దరు ఏమనుకోకుండానే వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్‌ హల్‌చల్‌ చేస్తుండగా అభిమానులు మాత్రం ఫన్నీమీమ్స్‌, కామెంట్స్‌తో జోకులు పేల్చుతున్నారు. రషీద్‌ వాట్సాన్‌... అంటే వాట్సన్‌.. వాట్‌ సన్‌! అని అడుగుతాడని కామెంట్‌ చేస్తున్నారు.

ఇక వాట్సన్‌ జట్టు కోచ్‌ ఫ్లెమింగ్‌.. కెప్టెన్‌ ధోనిలకు ధన్యవాదాలు తెలిపాడు. ‘ మంచు కురువడం వల్లే నేను పరుగులు చేశాను. మా కోచ్‌ స్టిఫెన్‌ ప్లెమింగ్‌, కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని థ్యాంక్స్‌ చెప్పకుండా ఉండలేను. నేను చాలా జట్లకు ఆడాను. ప్రస్తుత పరిస్థితే ఉంటే ఏ జట్టు నాకు అవకాశం ఇచ్చేది కాదు. కానీ ఫ్లెమింగ్‌,ధోని నాపై విశ్వాసం ఉంచి అవకాశం ఇచ్చారు.’ అని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకుంటూ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు