రిషబ్, జూహీ దేశాయ్‌లకు స్వర్ణాలు

9 Jul, 2018 10:12 IST|Sakshi

లేజర్‌ 4.7లో విజేతలుగా వైసీహెచ్‌ సెయిలర్లు

సీనియర్‌ మల్టీక్లాస్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో ఐదు రోజులుగా సందడి చేసిన సీనియర్‌ మల్టీక్లాస్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ ఆదివారంతో ముగిసింది. ఈ పోటీల్లో యాటింగ్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెయిలర్లు రిషబ్‌ నాయర్, జూహీ దేశాయ్‌ సత్తా చాటారు. ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్, సికింద్రాబాద్‌ సెయిలింగ్‌ క్లబ్, భారత లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో లేజర్‌ 4.7 విభాగంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. లేజర్‌ 4.7 అండర్‌–18 ఓపెన్‌ కేటగిరీలో రిషబ్‌ నాయర్‌ 27 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్‌ఎస్‌ఎస్‌కు చెందిన సతీశ్‌ యాదవ్‌ (31 పాయింట్లు), రామ్‌ మిలన్‌ యాదవ్‌ (38 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

బాలికల కేటగిరీలో జూహీ దేశాయ్‌ 113 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. రజతాన్ని సాధించిన కె. రజనీ ప్రియ (ఈఎంఈఎస్‌ఏ) 185 పాయింట్లతో రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్‌కు చెందిన దిలీప్‌ కుమార్‌ లేజర్‌ రేడియల్‌ ఓపెన్‌ కేటగిరీలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఆర్మీ యాటింగ్‌ నాడ్‌ (ఏవైఎన్‌)కు చెందిన రమ్య శరవణన్‌ మహిళల లేజర్‌ రేడియల్‌ విభాగంలో ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ఆసాంతం రాణించిన మోహిత్‌ సైనీ (ఏవైఎన్‌) లేజర్‌ స్టాండర్డ్‌ ఓపెన్‌ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ విభాగంలో ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచిన గితేశ్‌ (ఏవైఎన్‌) లెఫ్టినెంట్‌ కమాండర్‌ కెల్లీ ఎస్‌ రావు స్మారక ట్రోఫీని అందుకున్నాడు.

తొలిసారి ర్యాంకింగ్‌ ఈవెంట్‌గా నిర్వ హించిన ఈ పోటీల్లో 15 క్లబ్‌లకు చెందిన 195 మంది సెయిలర్లు పాల్గొన్నారు. లేజర్‌ స్టాండర్డ్‌ విభాగంలో 48 మంది, లేజర్‌ రేడియల్‌ విభాగంలో 67 మంది, లేజర్‌ 4.7 కేటగిరీలో 35, ఆర్‌ఎస్‌:ఎక్స్‌ విభాగంలో 16, 470 క్లాస్‌ కేటగిరీలో 24 మంది, ఫిన్‌ కేటగిరీలో ఐదుగురు సెయిలర్లు పోటీపడ్డారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్‌ కమాండర్, లెఫ్టినెంట్‌ జనరల్‌ పరమ్‌జీత్‌ సింగ్‌ పాల్గొన్నారు.  

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు

470 క్లాస్‌: 1. అతుల్‌ లిండే– సీహెచ్‌ఎస్‌ రెడ్డి (ఏవైఎన్‌), 2. ప్రవీణ్‌ కుమార్‌– సుధాన్షు శేఖర్‌ (ఈఎన్‌డబ్ల్యూటీసీ–ఎం), 3. సోను జాతవ్‌– ఆర్‌కే శర్మ (ఈఎన్‌డబ్ల్యూటీసీ–ఎం).

ఆర్‌ఎస్‌: ఎక్స్‌: 1. జెరోమ్‌ కుమార్‌ (ఏవైఎన్‌), 2. మన్‌ప్రీత్‌ సింగ్‌ (ఏవైఎన్‌), 3. కమలాపతి (ఈఎంఈఎస్‌ఏ).  

లేజర్‌ 4.7 ఓపెన్‌: 1. రిషబ్‌ నాయర్‌ (వైసీహెచ్‌), సతీశ్‌ యాదవ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), రామ్‌ మిలన్‌ యాదవ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌).
 
లేజర్‌ 4.7 అండర్‌–16 బాలురు: 1. రామ్‌ మిలన్‌ యాదవ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), 2. ఎ. సంజయ్‌ రెడ్డి (ఈఎంఈఎస్‌ఏ), 3. ఆశిష్‌ విశ్వకర్మ (ఎన్‌ఎస్‌ఎస్‌).
లేజర్‌ 4.7 బాలికలు: 1. నిత్య బాలచంద్రన్‌ (టీఎన్‌ఎస్‌ఏ), 2. సంచిత పతం (ఈఎంఈఎస్‌), 3. ఆర్‌. అశ్విని (ఈఎంఈఎస్‌).
లేజర్‌ 4.7 అండర్‌–18 బాలికలు: 1. జూహీ దేశాయ్‌ (వైసీహెచ్‌), 2. కె. రంజనీ ప్రియ (ఈఎంఈఎస్‌ఏ).

ఫిన్‌: 1. గుర్జీత్‌ సింగ్‌ (ఏవైఎన్‌), 2. స్వతంత్ర సింగ్‌ (ఏవైఎన్‌), 3. నవీన్‌ కుమార్‌ (ఏవైఎన్‌).
లేజర్‌ స్టాండర్డ్‌ ఓపెన్‌: 1. మోహిత్‌ సైనీ (ఏవైఎన్‌), 2. ముజాహిద్‌ ఖాన్‌ (ఏవైఎన్‌), 3. గితేశ్‌ (ఏవైఎన్‌).
లేజర్‌ స్టాండర్డ్‌ అండర్‌–21 యూత్‌: 1. పునీత్‌ కుమార్‌ సాహూ (ఐఎన్‌డబ్ల్యూసీటీ–ఎం), 2. నాగార్జున (టీఎస్‌సీ), 3. యమన్‌దీప్‌ (ఈఎంఈఎస్‌సీ).
లేజర్‌ స్టాండర్డ్‌ అప్రెంటీస్‌ మాస్టర్‌: 1. బీకే రౌత్‌ (ఈఎంఈఎస్‌ఏ), 2. పర్వీందర్‌ సింగ్‌ (ఈఎంఈఎస్‌ఏ), 3. చంద్రకాంత రావు (ఐఎన్‌డబ్ల్యూటీసీ–కే).
లేజర్‌ రేడియల్‌ ఓపెన్‌: 1. దిలీప్‌ కుమార్‌ (ఈఎంఈఎస్‌ఏ), 2. గితేశ్‌ (ఏవైఎన్‌), 3. ఇస్రాజ్‌ అలీ (ఏవైఎన్‌).

లేజర్‌ రేడియల్‌ మహిళలు: 1. రమ్య శరవణన్‌ (ఏవైఎన్‌), 2. తను బిసేస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), 3. అనన్య (ఈఎంఈఎస్‌ఏ).
లేజర్‌ రేడియల్‌ అండర్‌–19 యూత్‌: 1. రమ్య శరవణన్‌ (ఏవైఎన్‌), 2. సతీశ్‌ యాదవ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), 3. ఎం. కోటేశ్వరరావు (టీఎస్‌సీ).
లేజర్‌ రేడియల్‌ అప్రెంటీస్‌ మాస్టర్‌: 1. ధర్మేంద్ర (ఏవైఎన్‌), 2. జస్వీర్‌ సింగ్‌ (ఏవైఎన్‌), 3. బీకే శర్మ (ఈఎంఈఎస్‌ఏ).
లేజర్‌ రేడియల్‌ మాస్టర్‌: 1. సీడీఆర్‌ ఎంఎల్‌ శర్మ (ఐఎన్‌డబ్ల్యూటీసీ–కే).
లేజర్‌ రేడియల్‌ గ్రేట్‌ గ్రాండ్‌మాస్టర్‌: 1. మురళీ కనూరి (ఎస్‌ఎస్‌సీ).  

మరిన్ని వార్తలు