వికెట్‌ మిగిలుంది... మన గెలుపు ఖాయమైంది! 

12 Sep, 2019 03:48 IST|Sakshi

రెండు సెషన్లు వర్షార్పణం

దక్షిణాఫ్రికా ‘ఎ’ 179/9

తిరువనంతపురం: తొలి అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ బౌలర్ల జోరును వర్షం అడ్డుకున్నా... సఫారీని మాత్రం ఆదుకోలేకపోయింది. మూడో రోజు ఆటలో కేవలం 20 ఓవర్ల ఆటే జరిగినా... దక్షిణాఫ్రికా ‘ఎ’ పతనం మాత్రం క్రితం రోజులాగే కొనసాగింది. బుధవారం రెండు సెషన్లను వర్షం తుడిచిపెట్టింది. ఆట చాలా ఆలస్యంగా ఆఖరి సెషన్‌లో ఆరంభమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 125/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి 55 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సఫారీ జట్టు గత స్కోరుకు కేవలం 54 పరుగులు జోడించింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ క్లాసెన్‌ (48; 5 ఫోర్లు), ముల్డర్‌ (46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కాసేపు కుదురుగా ఆడారు. కానీ ఆఫ్‌స్పిన్నర్‌ జలజ్‌ సక్సేనా ఈ జోడీని విడగొట్టడంతో సఫారీ కష్టాలు మొదటికొచ్చాయి. ఆట నిలిచే సమయానికి సిపమ్లా (5 బ్యాటింగ్‌), ఇన్‌గిడి (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. గురువారం మ్యాచ్‌కు ఆఖరి రోజు. భారత్‌ ‘ఎ’ కంటే సఫారీ జట్టు కేవలం 40 పరుగుల స్వల్ప ఆధిక్యంలోనే  ఉంది. ఆఖరి వికెట్‌ను తీసి... నిర్దేశించే కొద్దిపాటి లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత జట్టుకు తొలి సెషన్‌ సరిపోతుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాహుల్‌కు కష్టకాలం!

ప్రియమైన భారత్‌... ఇది నా జట్టు... వీళ్లు నా కుర్రాళ్లు 

ఆసీస్‌ మహిళా క్రికెటర్‌ మెగాన్‌ షుట్‌ హ్యాట్రిక్‌

‘ధోనీతో పోలిక కంటే.. ఆటపైనే ఎక్కువ దృష్టి’

అది మార్కెట్లో దొరికే సరుకు కాదు: రవిశాస్త్రి

కొందరికి చేదు... కొందరికి తీపి!

‘హే స్మిత్‌... నిన్ను చూస్తే జాలేస్తోంది’

అరే మా జట్టు గెలిచిందిరా..!

అదొక చెత్త: రవిశాస్త్రి

మెక్‌గ్రాత్‌ సరసన కమిన్స్‌

‘అందుకే కుల్దీప్‌, చహల్‌లను తీసుకోలేదు’

మళ్లీ విండీస్‌కు ఆడాలనుకుంటున్నా బ్రో!

కోహ్లి పరుగుల రికార్డు బ్రేక్‌!

అమ్మో రవిశాస్త్రి జీతం అంతా!

దిగ్గజాల వల్ల కాలేదు.. మరి పైన్‌ సాధిస్తాడా?

మైకేల్‌ క్లార్క్‌ భావోద్వేగ సందేశం

క్రికెట్‌ బోర్డుపై నబీ సంచలన వ్యాఖ్యలు

ప్రదీప్‌ 26, తలైవాస్‌ 25

అఫ్గాన్‌ చరిత్రకెక్కింది

నాదల్‌ విజయనాదం

రవిశాస్త్రి జీతమెంతో తెలుసా..?

‘స్మిత్‌ జీవితాంతం మోసగాడిగానే గుర్తుంటాడు’

సచిన్‌కు ఈరోజు చాలా స్పెషల్‌!

ఫార్ములావన్‌ ట్రాక్‌పై ​కొత్త సంచలనం

ఉత్కంఠభరితంగా ఫైనల్‌ మ్యాచ్‌

లెక్‌లెర్క్‌దే టైటిల్‌

ఆసీస్‌దే యాషెస్‌

ఎవరీ బియాంక..!

భళా బియాంక!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో

రాత్రులు నిద్రపట్టేది కాదు

సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి