World Cup Final Match: అహ్మదాబాద్‌లో పర్యాటకుల రద్దీ

19 Nov, 2023 11:13 IST|Sakshi

ప్రపంచ కప్- 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు (నవంబర్ 19, ఆదివారం) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం దేశ, విదేశాల నుంచి క్రికెట్ ప్రేమికులు అహ్మదాబాద్‌కు తరలివచ్చారు. వీరంతా అహ్మదాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. దీంతో ఇక్కడి సబర్మతి ఆశ్రమం, భద్ర కోట, అక్షరధామ్ ఆలయం, గుజరాత్ సైన్స్ సిటీ, నైట్ మార్కెట్ ఆఫ్ లా గార్డెన్, కైట్ మ్యూజియం, అదాలజ్ స్టెప్‌వెల్‌ మొదలైనవన్నీ పర్యాటకులతో రద్దీగా మారాయి. ఈ పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సబర్మతి ఆశ్రమం
అహ్మదాబాద్‌లో పేరుగాంచిన ప్రముఖ ప్రదేశాలలో సబర్మతి ఆశ్రమం ఒకటి. సబర్మతీ నది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీకి చెందిన, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అనేక స్ఫూర్తిదాయక, ప్రేరణాత్మక వస్తువులను చూడవచ్చు. 

కంకారియా సరస్సు
అహ్మదాబాద్‌లో కంకారియా సరస్సు  అందమైన పర్యావరణానికి ప్రతీకగా నిలిచింది. కంకారియాలో అరుదైన జంతువుల అభయారణ్యం ఉంది. ఇది పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి కిడ్స్ సిటీలో థియేటర్, హిస్టారికల్ సెంటర్, రీసెర్చ్ లాబొరేటరీ, ఐస్ క్రీం ఫ్యాక్టరీ మొదలైనవి ఉన్నాయి.

భద్ర కోట
అహ్మదాబాద్‌లోని జామా మసీదు సమీపంలో భద్ర కోట ఉంది. దీనిని 1411లో నిర్మించారు. కోట నుండి అహ్మదాబాద్ నగరం ఎంతో అందంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళ  ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు.

లా గార్డెన్ నైట్ మార్కెట్
లా గార్డెన్‌కు చెందిన నైట్ మార్కెట్‌ను సందర్శించకపోతే అహ్మదాబాద్ పర్యటన అసంపూర్ణం అవుతుందని అంటారు. ఈ మార్కెట్‌లో చేతితో తయారు చేసిన గుజరాతీ దుస్తులు, వివిధ వస్తువులు లభ్యమవుతాయి.
ఇది కూడా చదవండి: భారత్‌ విజయం కోరుతూ ట్రాన్స్‌జెండర్ల ప్రత్యేక పూజలు

మరిన్ని వార్తలు