భారత్‌ మ్యాచ్‌ గెలిస్తే చాట్‌ ఫ్రీ!

19 Nov, 2023 13:49 IST|Sakshi

ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. యూపీలోని అమేథీకి చెందిన ఒక చిరు తినుబండారాల వ్యాపారి ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే తాను స్థానికులకు చాట్‌ ఉచితంగా పంచుతానని ప్రకటించాడు. దీనిని సంబంధించిన ప్రకటనను కూడా దుకాణం వద్ద అతికించాడు. 

అమేథీలోని గౌరీగంజ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర గుప్తాకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. క్రికెట్‌లో రాణిస్తూ జిల్లా స్థాయిలో వివిధ టోర్నమెంట్‌లలో కూడా ఆడాడు. సురేంద్ర తన దుకాణం వద్ద ఒక పోస్టర్‌ అతికించాడు. భారత్‌ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన తర్వాత సోమవారం ఉదయం 10 గంటల నుంచి తన వద్ద సరుకు ఉన్నంతవరకు, కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చాట్‌ ఉచితంగా పంపిణీ చేస్తానని ప్రకటించాడు.
ఇది కూడా చదవండి: పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది?

మరిన్ని వార్తలు