సాత్విక్–చిరాగ్‌ జోడీకి చుక్కెదురు

8 Jan, 2020 03:15 IST|Sakshi

మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ  

కౌలాలంపూర్‌: గతేడాది అద్భుత ఆటతీరుతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లోనూ స్థానం సంపాదించిన సాత్విక్ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంటకు కొత్త ఏడాది కలిసి రాలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సీజన్‌ తొలి టోర్నమెంట్‌ మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500  టోర్నీలో ప్రస్తుత ప్రపంచ 12వ ర్యాంక్‌ జంట సాతి్వక్‌–చిరాగ్‌ తొలి రౌండ్‌లోనే ని్రష్కమించింది. ప్రపంచ 19వ ర్యాంక్‌ ద్వయం ఓంగ్‌ యెవ్‌ సిన్‌–తియో ఈ యి 21–15, 18–21, 21–15తో సాత్విక్ –చిరాగ్‌ జంటకు షాక్‌ ఇచ్చింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌లో తడబడి రెండో గేమ్‌లో తేరుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 15–17 వద్ద భారత జంట వరుసగా నాలుగు పాయింట్లు సమరి్పంచుకొని ఓటమిని ఖాయం చేసు

కుంది. పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో శుభాంకర్‌ (భారత్‌) 15–21, 15–21తో డారెన్‌ ల్యూ (మలేసియా) చేతిలో... లక్ష్య సేన్‌ (భారత్‌) 21–11, 18– 21, 14–21తో విటింగ్‌హస్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడారు. నేడు పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో కెంటో మొమోటా (జపాన్‌)తో కశ్యప్‌; చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో శ్రీకాంత్‌; వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌)తో సమీర్‌ వర్మ; సునెయామ (జపాన్‌)తో ప్రణయ్‌; రస్‌ముస్‌ జెమ్కె (డెన్మార్క్‌)తో సాయిప్రణీత్‌ ఆడతారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో లియాన్‌ తాన్‌ (బెల్జియం)తో సైనా; కొసెత్‌స్కాయ (రష్యా)తో పీవీ సింధు తలపడతారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా