‘ఎట్టకేలకు కాస్త జుట్టు వచ్చింది’

29 Jun, 2020 21:17 IST|Sakshi

టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఆటకు సంబంధించి విశేషాలతో పాటు కుటుంబంతో ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను అలరిస్తూ ఉంటాడు. ఇక లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ధావన్‌ ఆ సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకుంటున్నాడు. కొడుకు జొరావర్‌తో కలిసి అల్లరి చేస్తూ.. భార్య అయేషాతో డ్యాన్స్‌ చేస్తూ సరదా సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులకు చేరువగా ఉంటున్నాడు.(‘నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్‌ అన్నారు’)

ఈ క్రమంలో సోమవారం ధావన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ‘ఎట్టకేలకు కాస్త జుట్టు వచ్చింది’ అంటూ నెత్తి మీద విగ్గు లాంటి క్యాప్‌ పెట్టుకుని ఉన్న ధావన్‌ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకు ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా లైకులు రాగా.. ‘న్యూలుక్‌ అదిరింది బ్రో’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ధావన్‌ నార్మల్‌ లుక్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే!.. కాగా  2010లో అరంగేట్రం చేసిన శిఖర్‌ ధావన్‌ ఇప్పటి వరకు 136 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు.  ఇటీవలే శిఖర్‌ ధావన్ పేరును బీసీసీఐ ‘అర్జున అవార్డు’ కోసం నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

Finally got some hair 😁

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా