బాక్సింగ్‌లో ‘పసిడి’ పంట

1 Nov, 2019 10:03 IST|Sakshi

శివ థాపా, పూజలకు స్వర్ణాలు

టోక్యో: ఒలింపిక్స్‌ టెస్ట్‌ ఈవెంట్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు శివ థాపా, పూజా రాణి బంగారు పతకాలు సాధించారు. ఫైనల్లో ఓడిన ఆశిష్‌ రజతంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 63 కేజీల టైటిల్‌ బౌట్‌లో నాలుగు సార్లు ఆసియా చాంపియన్‌ అయిన శివ 5–0తో ఆసియా కాంస్య విజేత సనతలి టోల్తయెవ్‌ (కజకిస్తాన్‌)పై ఎదురులేని విజయం సాధించాడు.

69 కేజీల తుదిపోరులో ఆశిష్‌కు 1–4తో జపాన్‌ బాక్సర్‌ సెవొన్‌ ఒకజవా చేతిలో పరాజయం ఎదురైంది. మహిళల 75 కేజీల కేటగిరీ ఫైనల్లో ఆసియా క్రీడల కాంస్య విజేత పూజా రాణి 4–1తో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్‌ పార్కర్‌పై విజయం సాధించింది. ఈ టెస్టు ఈవెంట్‌లో భారత్‌ మొత్తం ఏడు పతకాల్ని చేజిక్కించుకుంది. సెమీస్‌లో ఓడిపోవడంతో తెలంగాణ రెజ్లర్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (60 కేజీలు), సుమిత్‌ సాంగ్వాన్‌ (91 కేజీలు), వహ్లిమ్‌పుయా (75 కేజీలు) కాంస్య పతకాలతో తృప్తిపడ్డారు. 

మరిన్ని వార్తలు