‘ఈ దశాబ్దంలో అతడే బెస్ట్‌ ఫీల్డర్‌’

28 Oct, 2019 13:29 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు టెస్టు ఫార్మాట్‌లో సైతం వరుస విజయాలు సాధించడం వెనుక ఫీల్డింగ్‌ కూడా ఎంతో ప్రాముఖ్యత పోషిస్తుంది. అటు బ్యాటింగ్‌ విభాగం, ఇటు బౌలింగ్‌ విభాగం ఎంతో పటిష్టంగా మారినా ఇక్కడ ఫీల్డింగ్‌ను ఎంతమాత్రం తక్కువ చేయలేం. టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌ శ్రీధర్‌ తనకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తూ ఫీల్డింగ్‌ విభాగాన్ని పట్టిషంగా చేసేడనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతోనే ఇటీవల సహాయక కోచింగ్‌ స్టాఫ్‌ల్లో శ్రీధర్‌ నియమాన్ని మరోసారి పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

కాగా, తాజాగా భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్‌ ఎవరనే దానిపై శ్రీధర్‌ తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌ జట్టులో రవీంద్ర జడేజానే బెస్ట్‌ ఫీల్డర్‌ అంటూ కితాబిచ్చాడు. గత పదేళ్లుగా టీమిండియా ఫీల్డింగ్‌ విభాగాన్ని చూస్తే జడ్డూనే టాప్‌లో నిలుస్తాడన్నాడు. ‘ టీమిండియా అవకాశాల్ని జడేజా చక్కగా అందిపుచ‍్చుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గానే కాకుండా ఫీల్డర్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు. ఫీల్డింగ్‌లో అతను చురుగ్గా ఉంటూ అసాధారణ క్యాచ్‌లను అందుకుంటున్నాడు. పదేళ్ల కాలంలో జడ్డూనే బెస్ట్‌ ఫీల్డర్‌. భారత్‌కు దొరికిన అత్యుత్తమ ఫీల్డర్‌ జడేజా’ అని ఆర్‌ శ్రీధర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు