World Cup Final Match: ‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’

19 Nov, 2023 11:46 IST|Sakshi

ఈరోజు చారిత్రాత్మక రోజు. నేడు ప్రపంచకప్-2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2003 తర్వాత ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్‌లో ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. టీమ్ ఇండియా విజయం కోసం దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు. 

నేటి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలని కోరుతూ మసీదులు, చర్చిలు, దేవాలయాలు, గురుద్వారాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. కంగారూలతో పోరుకు టీమ్ ఇండియా సైన్యం సిద్ధమైంది. గ్రాండ్ ఫైనల్‌ను వీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్టేడియంనకు తరలివస్తున్నారు.

భారతదేశంలోని ప్రతిచోటా టీమ్ ఇండియా విజయం కోసం పూజలు చేస్తున్నారు. వారణాసిలోని విశ్వేశ్వరుని మొదలుకొని ఉజ్జయినిలోని మహాకాళీశ్వరుని వరకూ అందరు దేవుళ్లు భారత్‌ టీమ్‌ను ఆశీర్వదించాలని క్రికెట్‌ అభిమానులు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌లో పదిమంది యువకులు భారత్‌ గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టబోమంటూ కఠిన ఉపవాస దీక్షకుదిగారు. శివచౌక్‌కు చేరుకున్న ఈ యువకులు అక్కడి శివాలయంలో పూజలు  చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టుకోబోమని, ఒక వేళ భారత్‌ పరాజయం పాలయితే ఇక తమ జీవితంలో ఎప్పటికీ క్రికెట్‌ చూడబోమని ప్రతిజ్ఞ చేశారు.
ఇది కూడా చదవండి: అహ్మదాబాద్‌లో పర్యాటకుల రద్దీ

మరిన్ని వార్తలు