తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు

2 Jan, 2018 10:24 IST|Sakshi
తెలంగాణ, బిహార్‌ జట్ల మధ్య మ్యాచ్‌లోని దృశ్యం

జాతీయ కబడ్డీ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ కబడ్డీ టోర్నమెంట్‌ తొలిరోజు తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ పోటీల్లో పురుషుల జట్టు గెలుపొందగా,  మహిళల జట్టు పరాజయం పాలైంది. పురుషుల విభాగంలో తెలంగాణ 46–19తో చండీగఢ్‌పై ఘనవిజయం సాధించింది. బిహార్‌తో జరిగిన మరో మ్యాచ్‌ను 32–32తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి 21–12తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న తెలంగాణ చివరివరకు తమ జోరును కొనసాగించలేకపోయింది. రెండో అర్ధభాగంలో పుంజుకున్న బిహార్‌ అద్భుతంగా పోరాడి పరాజయం నుంచి తప్పించుకుంది. మహిళల విభాగంలో తెలంగాణ 16–21తో పశ్చిమ బెంగాల్‌ చేతిలో ఓడిపోయింది.  ఇతర మ్యాచ్‌ల్లో కర్ణాటక 75–9తో విదర్భపై, కేరళ 49–35తో ఒడిశాపై, గుజరాత్‌ 48–26తో జమ్మూ కశ్మీర్‌పై, ఏపీ 50–18తో పశ్చిమ బెంగాల్‌పై, ఢిల్లీ 55–32తో జార్ఖండ్‌పై, ఉత్తర్‌ప్రదేశ్‌ 48–17తో బీఎస్‌ఎన్‌ఎల్‌పై, రాజస్తాన్‌ 42–38 తో ఢిల్లీపై, మధ్యప్రదేశ్‌ 56–17తో త్రిపురపై, ఉత్తర్‌ప్రదేశ్‌ 38–17తో మణిపూర్‌పై, హరియాణా 42–22తో కేరళపై విజయం సాధించాయి.  


మహిళల మ్యాచ్‌ల వివరాలు


తమిళనాడు 45–28తో మణిపూర్‌పై, ఛత్తీస్‌గఢ్‌ 61–12తో పాండిచ్చేరిపై, బిహార్‌ 53–17తో జమ్మూ కశ్మీర్‌పై, కేరళ 31–19తో మధ్యప్రదేశ్‌పై, కర్ణాటక 42–18తో విదర్భపై, మహారాష్ట్ర 77–19తో గుజరాత్‌పై, ఉత్తర్‌ప్రదేశ్‌ 57–17తో అస్సాంపై, పంజాబ్‌ 64–34తో జార్ఖండ్‌పై, హిమాచల్‌ ప్రదేశ్‌ 38–32తో రాజస్తాన్‌పై, బిహార్‌ 31–15తో ఏపీపై నెగ్గాయి..

మరిన్ని వార్తలు