జిమ్నాస్టిక్స్‌ పోటీలు ప్రారంభం

30 Oct, 2017 10:38 IST|Sakshi

హైదరాబాద్: క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, విద్యార్థులు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాలని ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర జిమ్నాస్టిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘తెలంగాణ రాష్ట్ర జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌’ను ఆయన ఆదివారం ప్రారంభించారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో ఈనెల 31 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ పోటీల్లో 10 జిల్లాలకు చెందిన 400 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొన్నారు.

ఇందులో ప్రతిభ కనబరిచిన జిమ్నాస్ట్‌లు సౌత్‌జోన్, నేషనల్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లకు ఎంపికవుతారని ఆయన చెప్పారు. ఇదే కార్యక్రమంలో 2018 జనవరిలో హైదరాబాద్‌ వేదికగా జరుగనున్న ‘ఇంటర్నేషనల్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌’కు సంబంధించిన బ్రోచర్‌ను వెంకటేశ్వర్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి కె. మహేశ్వర్, నగర కార్యదర్శి విజయ్‌పాల్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలరాజు, హరికిషన్, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు