‘నన్ను, అంపైర్‌ను చంపుతామన్నారు’

8 Jun, 2020 15:49 IST|Sakshi
2011 ఓవల్‌ టెస్టులో 91 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరుతున్న సచిన్

మీకెంత ధైర్యం అంటూ వార్నింగ్‌ ఇచ్చారు

9 ఏళ్ల నాటి విషయాలను షేర్‌ చేసుకున్న బ్రెస్నాన్‌

లండన్‌: దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ది ఒక శకం. సచిన్‌ ఆట కోసమే పరితపించే రోజులవి. క్రికెట్‌ గ్రౌండ్‌లోకి సచిన్‌ అడుగుపెడితే చాలు అతని నామస్మరణే వినిపించేంది. అంతలా క్రికెట్‌తో మమేకం అయిపోయాడు సచిన్‌. సచిన్‌ తన కెరీర్‌లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. అలానే 90-100 మధ్యలో(నెర్వస్‌ నైన్టీస్‌) సచిన్‌ ఔట్‌ అయిపోయిన సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. మరి 100 సెంచరీ పూర్తి చేసుకునే క్రమంలో సచిన్‌ నెర్వస్‌ నైన్టీస్‌లో పెవిలియన్‌ చేరితే ఫ్యాన్స్‌కు కోపం రావడం సహజం. మరి అది ఔట్‌కాని ఔట్‌ అయితే అభిమానులకు ఎంతలా చిర్రెత్తుకొస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్రర్లేదు. అదే జరిగిందట 9 ఏళ్ల నాటి మ్యాచ్‌. సచిన్‌కు 100వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకోబోతున్నాడు అనే సంబరంలో ఉన్న ఫ్యాన్స్‌కు అంపైర్‌ రాడ్‌ టక్కర్‌ షాకిచ్చాడు. లెగ్‌ స్టంప్‌ పైనుంచి వెళుతున్న బంతిని ఔట్‌గా ఇచ్చి విమర్శల పాలయ్యాడు. అంతేకాదు చంపుతామంటూ ఫ్యాన్స్‌ బెదిరింపులు కూడా చవిచూశాడు. (‘అదే కోహ్లిని గ్రేట్‌ ప్లేయర్‌ను చేసింది’)

ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ టిమ్‌ బ్రెస్నాన్‌ తెలిపాడు. యార్క్‌షైర్‌ క్రికెట్‌: కవర్స్‌ ఆఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెస్నాన్‌ ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్నాడు. ‘ అది 2011లో ఓవల్‌లో టెస్టు మ్యాచ్‌ జరుగుతుంది. సచిన్‌ 80 వద్ద నుంచి జాగ్రత్తగా ఆడటం మొదలు పెట్టాడు. ఆ క్రమంలోనే 91 పరుగులకు వచ్చాడు. నేను వేసిన ఒక బంతికి సచిన్‌ ఔటయ్యాడు. సచిన్‌ ప్యాడ్లకు బంతి తగిలింది. దాంతో నేను ఔట్‌ కోసం అప్లై చేయడం, అంపైర్‌ టక్కర్‌ ఔట్‌ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే లెగ్‌ స్టంప్‌ పైనుంచి వెళుతుంది. అటే సచిన్‌ ఔట్‌ కాదు. ఇలా సచిన్‌ ఔట్‌కాని ఔట్‌కు పెవిలియన్‌కు చేరడం, అది కూడా 100వ సెంచరీ చేయడం ఫ్యాన్స్‌కు విపరీతమైన కోపం తెప్పించి ఉంటుంది. అది గడిచిన చాలా కాలం తర్వాత మాకు డెత్‌ వార్నింగ్స్‌ వచ్చాయి. ‘లెగ్‌ స్టంప్‌ మిస్సవుతున్న బంతికి అంపైర్‌ ఎలా ఔటిస్తాడు.. నువ్వు దాన్ని ఎలా అంగీకరించావు.. మీకెంత ధైర్యం.మిమ్ముల్ని చంపుతామంటూ బెదిరించారు’ అని బ్రెస్నాన్‌ తెలిపాడు. దాంతో తామిద్దరం వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులతో పాటు పోలీస్‌ ప్రొటెక్షన్‌ కూడా తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. కాగా, ఆ తర్వాత 2012లో సచిన్‌ తన శతకాల సెంచరీని పూర్తి చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.(బీబీసీకి బాయ్‌కాట్‌ గుడ్‌బై )

మరిన్ని వార్తలు