‘ఆమె మరో హర్భజన్‌ సింగ్‌’

23 Oct, 2019 20:33 IST|Sakshi

హైదరాబాద్‌: అభిమానులు తమకు నచ్చిన ఆటగాళ్లను, నటీనటులను అనుకరించడడం సర్వసాధారణం. వారిలా నటించడం, డైలాగ్‌లు చెప్పడం, డ్యాన్స్‌లు చేయడం అభిమానులకు పరిపాటిగా మారింది. అయితే ఈ మధ్యకాలంలో క్రికెటర్ల శైలిని అనుకరిస్తూ వారిలా బ్యాటింగ్‌/బౌలింగ్‌ చేసుందకు కొంత మంది అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గతంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ బుడ్డోడు జస్ప్రిత్‌ బుమ్రాలా బౌలింగ్‌ చేయడం.. శ్రీలంకకు చెందిన యువ ఆటగాడు లసిత్‌ మలింగా శైలిలో బౌలింగ్‌ చేయడం చూశాం. తాజాగా టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌ శైలిని అనుకరిస్తూ ఓ అభిమాని బౌలింగ్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆయితే ఆ అభిమాని ఓ బాలిక కావడం విశేషం. హర్భజన్‌ సింగ్‌ శైలితో పాటు జస్ప్రిత్‌ బుమ్రా యాక్షన్‌ ఆ బాలిక బౌలింగ్‌లో మేళవింపై ఉన్నాయి. అయితే ఈ వీడియోను టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేయడం మరో విశేషం.  

‘ఈమెను చూస్తేంటే నిన్నే(హర్భజన్‌ సింగ్‌) ఆదర్శంగా తీసుకున్నట్టుంది. భవిష్యత్‌లో దేశానికి మరో నాణ్యమైన స్పిన్నర్‌ దొరికే అవకాశం ఉంది’ అంటూ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం చోప్రా షేర్‌ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ‘ఆమె మరో హర్భజన్‌ సింగ్‌’అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక హర్భజన్‌, ఆకాశ్‌ చోప్రాలిద్దరూ క్రికెట్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహిరస్తున్న విషయం తెలిసిందే. భారత్‌-దక్షిణాఫ్రికా మూడో టెస్టు సందర్భంగా జాంటీ రోడ్స్‌తో హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంచీ టెస్టులో జాంటీ రోడ్స్‌ బ్యాటింగ్‌కు దిగితేనైనా దక్షిణాఫ్రికా మెరుగైన స్కోర్‌ సాధిస్తుంది అంటూ అతడితో భజ్జీ చమత్కరించాడు. అయితే ఈ వ్యాఖ్యలను జాంటీ రోడ్స్‌ చాలా సరదాగా తీసుకున్నాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా