‘కోహ్లి ట్రాఫిక్‌ చలాన్‌ కట్టావా.. ఏంటి?’

5 Sep, 2019 19:14 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ఫోటోలను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. అభిమానులను ఖుషి చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా కోహ్లి పోస్ట్‌ చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కేవలం షార్ట్‌ మాత్రమే ధరించి.. నేలపై కూర్చుని ఉన్న ఫోటోను.. ‘మన అంతరంగంలోకి మనం చూసుకున్నంత కాలం.. బయటి దేని గురించి మనం వెతకవలసిన అవసరం లేదు’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు కోహ్లి. ఈ ఫోటోపై కొందరు అభిమానులు సానుకూలంగా స్పందించగా.. మరికొందరు నెటిజనులు మాత్రం ‘కోహ్లి ట్రాఫిక్‌ చలాన్‌ కట్టావా.. ఏంటి’ అని కామెంట్‌ చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం ట్రాఫిక్‌ అధికారులు ఆర్సీ, హెల్మెట్‌ లేదనే కారణంతో ఓ వ్యక్తికి రూ.23 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు. ‘బట్టలు వేసుకుని కూడా ఈ విషయం చెప్పవచ్చు కోహ్లి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. వెస్టిండీస్‌పై టెస్ట్‌ సిరీస్‌ విజయంతో కోహ్లి భారత అత్యుత్తమ కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
(చదవండి: ధోని రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లి)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి! 

ఐపీఎల్‌ కన్నా ప్రాణం మిన్న

సఫారీ ఆటగాళ్లంతా సేఫ్‌ 

మీ మద్దతు కావాలి

ఆ క్షణం ఇంకా రాలేదు

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...