తొలి టెస్టుకు రోచ్‌ దూరం 

3 Oct, 2018 00:57 IST|Sakshi

రాజ్‌కోట్‌: ప్రధాన పేసర్‌ కీమర్‌ రోచ్‌ లేకుండానే వెస్టిండీస్‌ తొలి టెస్టు బరిలో దిగనుంది. అమ్మమ్మ మృతితో స్వదేశానికి వెళ్లిన అతడు ఇంకా తిరిగి రాలేదు. ఈ కారణంగానే రోచ్‌ బోర్డు ఎలెవెన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ ఆడలేదు. అతడు తొలి టెస్టు మధ్యలో జట్టుతో చేరే అవకాశం ఉందని కోచ్‌ స్టువర్ట్‌ లా తెలిపారు.

మరో పేసర్‌ జోసెఫ్‌ గాయంతో ఇబ్బంది పడుతుండటంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్టులో గాబ్రియెల్‌ జతగా కీమో పాల్‌ విండీస్‌ పేస్‌ భారాన్ని పంచుకునే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు