కోహ్లి ఫోటో షేర్‌ చేసిన ఐసీసీ.. ఫ్యాన్స్‌ ట్రోల్స్‌

5 Jun, 2019 20:29 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి సంబంధించిన ఓ ఫోటోను షేర్‌ చేసిన ఐసీసీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రపంచకప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా టీమిండియా తలపడతున్న నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు ఐసీసీ కోహ్లి ఫోటోను షేర్‌ చేసింది. ఆ ఫోటోలో కోహ్లి ఓ చేతిలో బ్యాట్‌, మరో చేతిలో బాల్‌, కిరీటం ధరించి, రాజును పోలిన డ్రెస్‌లో దర్శనమిచ్చాడు. అంతేకాదు టీమిండియా గెలిచిన ప్రపంచకప్‌ సంవత్సరాలతో పాటు కోహ్లిని పొగుడుతూ కొన్ని కొటేషన్స్‌లు అందులో ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

ఐసీసీ చేసిన కోహ్లి ఫోటోపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇలా టీమిండియా సారథిని గౌరవించడం బాగుందంటూ కోహ్లి ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు నెటిజన్లు మాత్రం ఐసీసీ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ టీమిండియా అభిమానిలా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచకప్‌లో కేవలం భారత్‌ మాత్రమే ఆడటంలేదనే విషయాన్ని ఐసీసీ గుర్తించాలని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే ఐసీసీ భారత ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ కంటే అతిగా వ్యవహరిస్తొందని మరికొందరు మండిపడుతున్నారు. ఐసీసీని బీసీసీఐ సొంతం చేసుకుంది అంటూ మరి కొంత మంది కామెంట్‌ చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు