ఉత్తరాఖండ్‌ ఆర్థికమంత్రి కన్నుమూత

5 Jun, 2019 20:13 IST|Sakshi

అనారోగ్యంతో ఉత్తరాఖండ్‌ ఆర్థికమంత్రి  మృతి 

అమెరికాలో చికిత్స పొందుతూ తుది శ్వాస

రాష్ట్రంలో రేపు (గురువారం) సెలవు ప్రకటించిన ప్రభుత్వం 

మూడు రోజులు సంతాప దినాలు

ఉత్తరాఖండ్‌ ఆర్థికమంత్రి ప్రకాశ్‌ పంత్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు.  ఛాతీ సమస్యతో చనిపోయారని  ప్రకాశ్‌ పంత్‌  సోదరుడు మీడియాకు అందించిన సమాచారంలో తెలిపారు.  దీంతో రాష్ట్రంలో  రేపు (గురువారం)  సెలవు దినంగాను అలాగే మూడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని ప్రభుత్వం ప్రకటించింది.   ప్రకాశ్‌ పంత్‌ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు.  

వైద్యం నిమిత్తం అమెరికాకు వెళ్లడానికి ముందు, ఢిల్లీలోని రోహిణి ఆసుపత్రిలో చాలాకాలం చికిత్స తీసుకున్నారు మంత్రి ప్రకాశ్‌ పంత్‌. అనారోగ్యం కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర శాసనసభలో 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా అసెంబ్లీలోనే పంత్‌ కుప్పకూలిపోయారు. కాసేపటికి తేరుకున‍్నప్పటికీ..అసౌకర్యంగా ఫీల్‌ కావడంతో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ బడ్జెట్‌  ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని వార్తలు