యువీ సిక్సర్ల హ్యాట్రిక్‌

28 Mar, 2019 21:16 IST|Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు యువరాజ్‌ మెరుపులు మెరిపించాడు. క్రీజ్‌లో ఉన్నది కాసేపు అయినా బెంగళూరుకు దడపుట్టించాడు. ప్రధానంగా ఆర్సీబీ స్పిన్నర్‌ చహల్‌ వేసిన 14వ ఓవర్‌లో యువీ దుమ్మురేపాడు. హ్యాట్రిక్‌ సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే నాల్గో బంతికి సైతం భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. బౌండరీ లైన్‌వద్ద సిరాజ్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో యువరాజ్‌ ఇన్నింగ్స్ ముగిసింది.

రోహిత్‌ శర్మ(48) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత వచ్చిన యువీ తొలుత నెమ్మదిగా ఆడాడు. ఆపై రెచ్చిపోయిన యువరాజ్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గతంలో ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్ల కొట్టిన నాటి జ్ఞాపకాన్ని యువీ గుర్తుకు తెచ్చాడు. అయితే చహల్‌ కాస్త ఆఫ్‌ స్టంప్‌ బయటకు వేసిన బంతి బ్యాట్‌కు మిడిల్‌ కాకపోవడంతో బౌండరీ లైన్‌ ముందు సిరాజ్‌కు దొరికిపోయాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనధికార వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం : ద్వివేదీ

ఇక ఆపండ్రా నాయనా.. ఆ ట్వీట్‌ తీసేశా!

బెంగాలీ సెంటిమెంట్‌పై ‘ఎన్నికల దాడి’

కోహ్లి తర్వాతే అతనే సరైనోడు..!

ఐపీఎల్‌ ఫైనల్‌ చాలా ‘హాట్‌’ 

వాట్సన్‌పై ముంబై ఫ్యాన్స్‌ కామెంట్స్‌

‘డబ్బు కోసమే.. ధోనిని ఔట్‌గా ప్రకటించారు’

కుంబ్లేను గుర్తుచేశావ్‌ వాట్సన్‌..

‘థ్యాంక్యూ సచిన్‌ సర్‌’

వార్నీ.. కేఎల్‌ రాహుల్‌ అవార్డు.. పాండ్యా చేతికి!

ఈ సీజనే అత్యుత్తమం 

బేసి... సరి అయినప్పుడు! 

క్యాప్‌లు సాధించకున్నా.. కప్‌ గెలిచాం..

‘ధోని హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది’

ఐపీఎల్‌-12లో జ్యోతిష్యమే గెలిచింది..

నాలుగు కాదు.. ఐదు: రోహిత్‌