ప్రతిభా భారతి మనవడు మృతి

4 Jan, 2018 11:55 IST|Sakshi
విఖ్యాత్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు

బాత్‌రూమ్‌లో జారిపడి మృతిచెందిన గ్రీష్మాప్రసాద్‌ కుమారుడు

శ్రీకాకుళం , రాజాం: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, రాజాం ఇన్‌చార్జి కావలి ప్రతిభాభారతి మనవడు గొలగాన విఖ్యాత్‌(5) బుధవారం మృతిచెందాడు. ప్రతిభా భారతి కుమార్తె, రాజాం సామాజిక ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ గ్రీష్మాప్రసాద్‌ కుమారుడు విశాఖపట్నంలో ఉంటున్నారు. ఈమె కుమారుడు విఖ్యాత్‌ మంగళవారం రాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. వెంటనే బాలుడిని విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతుండగానే రాత్రి 2 గంటల సమయంలో మృతిచెందాడు.

విఖ్యాత్‌ తన తల్లి దగ్గరకంటే ప్రతిభాభారతి వద్దే ఎక్కువగా ఉండేవాడు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గ్రీష్మాప్రసాద్, రఘులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతదేహాన్ని బుధవారం సంతకవిటి మండలంలోని ప్రతిభాభారతి స్వగ్రామం కావలి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలకు చెందిన టీడీపీ నేతలు అధికసంఖ్యలో కావలి చేరుకుని ప్రతిభాభారతితో పాటు ఆమె కుమార్తె గ్రీష్మాప్రసాద్‌ను పరామర్శించారు.

Read latest Srikakulam News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు