'యూజ్ మీ' ఇట్స్‌ లోకల్‌ గురూ!

26 Mar, 2018 08:16 IST|Sakshi
వెబ్‌సైట్‌:www.uzzme.in

ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో న్యూ కాన్సెప్ట్‌  

నగరవాసులకు అందుబాటులో సరికొత్త యాప్‌  

సమీపంలోని దుకాణాలే

కనిపించేలా రూపకల్పన    

ధరలు సరిపోల్చుకునే అవకాశం

ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు ఎన్నో యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రముఖ సంస్థలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి మనకు దగ్గర్లోని దుకాణాలు అందుబాటులో ఉండే యాప్స్‌ ఉన్నాయా? వాటిలో ధరలు సరిపోల్చుకునే అవకాశం ఉందా? అంటే ఉంది. సరికొత్తగానగరవాసులకు పరిచయమైనయూజ్‌ మీ యాప్‌తో ఇవి సాధ్యమే

సాక్షి, సిటీబ్యూరో :నగరానికి చెందిన సంజయ్‌ కప్పగంతుల మెకానికల్‌ ఇంజినీర్‌. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో నాలుగేళ్లు పనిచేసి 1999లో అమెరికా వెళ్లాడు. 13ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశాడు. ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకొని 2013లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించాడు. అయితే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కంటే సామాన్యుల సమస్యలకు పరిష్కారం చూపే సంస్థ ఏదైనా తీసుకురావాలని ఆలోచించాడు. ఒక్క ఫోన్‌కాల్‌తో అన్ని సేవలందించే విధానానికి శ్రీకారం చుట్టాడు. అయితే అది అంతగా సక్సెస్‌ కాలేదు. తర్వాత యాప్‌ రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే జస్ట్‌ డయల్‌ లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో ఫీడ్‌బ్యాక్‌ ప్రధాన సమస్య అని గుర్తించి ‘యూజ్‌ మీ’ యాప్‌ రూపొందిచినట్లు సంజయ్‌ చెప్పారు.

యూజర్స్‌–వెండర్స్‌ కనెక్ట్‌..  
‘ఆన్‌లైన్‌ సేవల విషయంలో ఇప్పటికే కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానంగా పెద్ద దుకాణాలు, ప్రముఖ సేవల సంస్థలే అందుబాటులో ఉంచారు. మన దగ్గర్లోని కిరాణ దుకాణాలు, స్వీట్‌ షాప్స్, కూల్‌ డ్రింక్స్, బైక్‌ మెకానిక్‌ సెంటర్స్, ప్లంబర్‌ తదితర అందులో ఉండవు. 70 శాతం మంది ఇలాంటి అవసరాలున్నవారే ఉన్నారు. పైగా వినియోగదారుడికి, దుకాణాదారుకు మధ్య అనుసంధానం ఉండదు. అందుకే ‘యూజ్‌ మీ’ యాప్‌ రూపొందించాం. యూజర్స్, వెండర్స్‌ను కనెక్ట్‌ చేశాం. ప్రస్తుతం చాటింగ్‌ చేయడం ఎక్కువగా జరుగుతోంది. అందుకే చాట్‌ ద్వారానే ఈ ప్రకియ పూర్తి చేసేలా యాప్‌ను తీర్చిదిద్దామ’ని సంజయ్‌ వివరించారు.  

గల్లీ కొట్టులో కొనుగోలు చేయొచ్చు...   
‘ఈ యాప్‌ సహాయంతో వినియోగదారులకు సమీపంలోని వ్యాపార సంస్థలు, సేవలందించే వాటి వివరాలు జీపీఎస్‌ ఆధారంగా తెలియజేస్తున్నాం. తద్వారా నచ్చిన సేవలు పొందొచ్చు. సేవలు, వ్యాపార విధానంలో ఇదో విప్లవాత్మక మార్పు. సమీపంలోని కిరాణా దుకాణాలకు ఆర్డర్‌ ఇవ్వొచ్చు. మీరు కొనుగోలు చేయబోయే వస్తువును ఇతర దుకాణాల్లో ఎంతకు విక్రయిస్తున్నారో తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఈ తరహా సేవలందించే వాళ్లు ప్రమోషన్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం మా వద్ద 56 కేటగిరీలు, 3 లక్షల వెండర్ల డాటా ఉంది. దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా గత నెలలో హైదరాబాద్, విజయవాడలో ప్రారంభించాం. మా సేవలకు సానుకూల స్పందన వస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యాప్‌ అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్‌ యాప్‌ తీసుకురానున్నామ’ని చెప్పారు సంజయ్‌. 

మరిన్ని వార్తలు