అస్త్రశస్త్రాలతో సిద్ధం

12 Dec, 2016 13:51 IST|Sakshi

21 నుంచి బెల్గాంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు
సమస్యలపై ప్రశ్నలు సంధించనున్న విపక్షాలు

దీటుగా ఎదుర్కోవడానికి సహచరులకు సీఎం దిశానిర్దేశం

బెంగళూరు : రెండో రాజధాని బెల్గాంలో ఈసారి శీతాకాల శాసనసభ సమావేశాలు వాడీ వేడిగా జరుగనున్నారుు. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారుు. అరుుతే వీటిని దీటుగా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని సీఎం సిద్ధరామయ్య తన సహరులకు ఇప్పటికే దిశ నిర్దేశం చేశారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 2 వరకూ బెళగావిలోని సువర్ణ సౌధలో శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా కరువు కాటకాల్లో మునిగిపోరుున రైతులను ఆదుకోవడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రైతు సంఘం నాయకులు సమావేశాల మొదటి రోజు సువర్ణసౌధ ముట్టడికి ఇప్పటికే పిలుపునిచ్చారు. చెరకు బకారుుల సత్వరం చెల్లించడంతో పాటు ఎకరాకు రూ. 15 వేలు నష్టపరిహారం, ఇక సహకార రుణాలు మాఫీ చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇందుకు బీజేపీ, జేడీఎస్ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. సమావేశాల మొదటి రోజును సభను స్తంభింప చేయాలని విపక్షాలు ఏకతాటిపైకి వచ్చారుు. అరుుతే కరువు తాలూకాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో రుణాలు రద్దు చేసి కొంత వరకు రైతు సంఘం నాయకులు శాంతింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక కావేరి వివాదంపై చర్చించడానికి రెండుసార్లు ప్రత్యేక శాసనసభ సమావేశాలను జరిపిన సిద్ధరామయ్య ప్రభుత్వం మహదారుు వివాదం పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ ప్రాంతానికి చెందిన విపక్ష నేతలు భావిస్తున్నారు. ఇక వేసవి మొదలు కాకుండానే తాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు ఉత్పన్న మవుతున్న విషయానికి సంబంధిం విపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి అవసరమైన గణాంకాలను సేకరిస్తున్నారుు.  

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల హత్యలపై...
ఇక రాష్ట్రంలో శాంతిభద్రత విషయంపై కూడా విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల హత్యలతో బీజేపీ శ్రేణులు మండిపోతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే సిద్ధు సర్కార్‌పై బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఇక మంత్రి తన్వీర్ వ్యవహారం, ఎంఈఎస్ ప్రాబల్యం ఉన్న బెల్గాంలో ఈ సారి శీతాకాల సమావేశాలు అధికార పార్టీకి చెమటలు పట్టిస్తాయనడంలో సందేహం లేదు.
 

మరిన్ని వార్తలు