Viral Video: కళ్లు చెదిరే విన్యాసం.. సచిన్‌ టెండూల్కర్‌ను సైతం ముగ్ధుడిని చేసింది

31 Oct, 2023 13:21 IST|Sakshi

బెల్గామ్‌లో (కర్ణాటక) జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించిన వీడియో  నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో కిరణ్ తర్లేకర్ అనే స్థానిక క్రికెటర్‌ బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి, సహచరుడు క్యాచ్‌ పట్టేందుకు తోడ్పడతాడు. వివరాల్లోకి వెళితే.. బెల్గామ్‌లో స్థానికంగా ఓ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్యాటర్‌ భారీ షాట్‌ కోసం​ ప్రత్నించి క్యాచ్‌ ఔట్‌ అవుతాడు. బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ పట్టుకునే క్రమంలో తర్లేకర్ అనే ప్లేయర్‌ అద్భుతమైన విన్యాసాన్ని చేశాడు. 

సిక్సర్‌గా వెళ్లే బంతిని గాల్లోకి నెట్టి ఫుట్‌బాల్‌ తరహాలో షాట్‌ కొట్టి సహచరుడు క్యాచ్‌ పట్టుకునేలా చేశాడు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. తర్లేకర్ విన్యాసాన్ని చూసి క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సైతం ముగ్దుడయ్యాడు. ఈ క్యాచ్ పట్టిన ఆటగాడికి ఫుట్ బాల్ కచ్చితంగా తెలిసి ఉండాలని కామెంట్‌ చేశాడు. ఇదే వీడియోను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం రీట్వీట్ చేస్తూ..  గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్ అని క్యాప్షన్ ఇచ్చాడు.
 

మరిన్ని వార్తలు