రామ్ చిత్రంలో అంజలి

29 Jul, 2015 03:22 IST|Sakshi
రామ్ చిత్రంలో అంజలి

 నటి అంజలి సంచలన నటే కాదు, మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ కూడా. అయితే, ఆమెకు ఇంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు రామ్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే, ఈ 16 అణాల తెలుగు అమ్మాయిని తమిళ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. కట్రదు తమిళ్ చిత్రం ద్వారా అంజలిని హీరోయిన్‌గా రామ్ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆతర్వాత అంగాడి తెరువు, ఎంగేయుం..ఎప్పోదుం లాంటి చిత్రాలతో అంజలి ప్రాచూర్యం పొందింది. అలా, నటిగా ఎదుగుతున్న ఈ అమ్మడుకు పిన తల్లితో ఏర్పడ్డ మనస్పర్థలు, దర్శకుడు కలంజియంతో ఏర్పడ వివాదాల కారణంగా అనూహ్యంగా చెన్నైలో మాయమై హైదరాబాద్‌లో ప్రత్యక్షం అయింది.
 
  అక్కడ కొన్ని చిత్రాలు చేసి , ఇటీవల మళ్లీ జయం రవి సరసన సకల కలా వల్లవన్ చిత్రంతో రీ  ఎంట్రీ అయింది. ఈనెల 31న చిత్రం విడుదల కానున్నది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, ఎస్‌జే సూర్య, బాబిసింహాలతో నటిస్తున్న, ఇరైవి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నది. ఆమె తొలి దర్శకుడు రామ్ నటి ఆండ్రియా హీరోయిన్‌గా తరమణి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నటి అంజలి కీలక పాత్ర పోషించడం విశేషం.
 
 ఈవిషయాన్ని దర్శకుడు రామ్ తెలుపుతూ, అంజలి ది అతిథి పాత్ర అయినా, చాల కీలకంగా ఉంటుందన్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలిపారు. కాగా, తదుపరి రామ్ రూపొందించనున్న చిత్రంలో తంగమీన్‌గల్ చిత్రంలో తనతో నటించిన సాధనను హీరోయిన్‌గా ఎంపిక చేసుకుని న్నారు. ఇందులో మల యళ సూపర్‌స్టార్ మమ్ముటి హీరో కావడం విశేషం.ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో ఆరంభం కానున్నది.

మరిన్ని వార్తలు