అవతార్ స్థాయిలో బాహుబలి

19 Jul, 2015 02:27 IST|Sakshi
అవతార్ స్థాయిలో బాహుబలి

ప్రపంచ సినీ చరిత్రలో హాలీవుడ్ చిత్రం అవతార్ తరువాత అంత అద్భుత చిత్రం బాహుబలి అని దర్శకనిర్మాత లింగసామి వ్యాఖ్యానించారు.టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి తాజా అద్భుత సృష్టి బాహుబలి.తెలుగు,తమిళ భాషలలో రూపొందించిన అత్యంత భారీ చిత్రం ఇది .ప్రభాస్,రానా,అనుష్క,తమన్న,రమ్యక్రిష్ణ,సత్యరాజ్,నాజర్ తదితరులు ప్రదాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు,తమిళం హిందీ అంటూ భాషా భేదం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విజయవిహారం చేస్తున్న నేపధ్యంలో ఈచిత్రాన్ని తమిళనాడులో విడదల చేసిన స్డూడియో గ్రీన్ సంస్థ థ్యాంక్స్ మీట్ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వయించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక నిర్మాత లింగసామి మాట్లాడుతూ ఇది గోల్డెన్ ఇయర్ అని పేర్కోన్నారు. కారణం బాహుబలినేనన్నారు.ఈ చిత్రంలో అంత గ్రాండియర్ కనిపిస్తోందని అన్నారు.ఈ చిత్ర దర్శకుడు ఇండియాలోనే బెస్ట్ డెరైక్టర్ అని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం సినిమా పోటీనీ,అసూయను జయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.అలాంటి వాటిని అధిగమించి బాహుబలి హాలీవుడ్ చిత్రం అవతార్ స్థాయికి చేరకుందన్నారు. బాహుబలి  పేరు ఇప్పుడు ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తోందని అన్నారు.సూడియోగ్రీన్ అదినేత కేఇ జ్ఞూనవేల్ రాజా మాట్లాడుతూ రాజమౌళి చేసిన మగధీర చిత్రం ఇక్కడ సరిగా పొజిషన్ కాలేదన్నారు.అ తరువాత తీసిన నాన్‌ఈ చిత్రం మంచి హిట్ అయ్యిందని చెప్పారు.మూడవ చిత్రం బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు.ఇది మూడు ఏళ్ళ చిత్ర టీమ్ హార్డ్ వర్క్‌కు దక్కిన ఫలితంగా పేర్కోన్నారు.

తమిళంలో నటిస్తా
నటుడు ప్రభాస్ మాట్లాడుతూ బాహుబలి కోసం రెండున్నర ఏళ్ల నిరంతరం శ్రమించినట్లు తెలిపారు.తాను 300 రోజులు పని చేశానని చెప్పారు.చిత్రం విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింపబడడం సంతోషంగా ఉందన్నారు. నటుడు సత్యరాజ్ తన కాలును తన నెత్తిపై పెట్టుకునే సన్నివేశంలో నటించడానికి చాలా టెన్షన్ పడ్డానన్నారు.తమిళంలో మంచి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ప్రభాస్ ఈ సందర్భంగా పేర్కోన్నారు.ఈ సమావేశంలో నటి రమ్యకృష్ణ,జీవీ ప్రకాశ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.
 

మరిన్ని వార్తలు