పొగరాయుళ్లకు చెక్‌

31 Aug, 2018 09:03 IST|Sakshi

బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్స్, క్లబ్బుల్లో ధూమపాన నిషేధం

ఉద్యాన నగరిలో బీబీఎంపీ నిబంధన

ఉల్లంఘిస్తే లైసెన్స్‌ రద్దు

కర్ణాటక, బనశంకరి :  ఉద్యాననగరిలో ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హోటల్స్, పబ్స్, క్లబ్‌లు సార్వజనిక ప్రాంతాలను ధూమపాన రహిత ప్రదేశాలుగా ప్రకటించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు కూడా రద్దు చేస్తామని బీబీఎంపీ హెచ్చరించింది. హోటల్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానులు చట్టపరంగా నో స్మోకింగ్‌జోన్‌ను ఏర్పాటు చేయడానికి పొగాకు నియంత్రణ శాఖ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. నో స్మోకింగ్‌జోన్‌లో అల్పాహారం, భోజనం, మద్యం, సిగరెట్, నీరు, కాఫీ, టీ తదితర వాటిని సరఫరా చేయరాదు. కోప్టా చట్టం అనుగుణంగా 30కి పైగా ఆసనాలు ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్, హోటల్స్, పబ్స్, క్లబుల్లో నో స్మోకింగ్‌జోన్‌ ఏర్పాటు చేయాలని బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది.

మైనర్లు, స్మోకింగ్‌ చేసేవారిని నో స్మోకింగ్‌ జోన్‌లోకి అనుమతించరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘించే హోటల్స్, పబ్‌ అండ్‌ బార్‌ రెస్టారెంట్లు, క్లబ్స్‌ లైసెన్సు రద్దు చేస్తామని సూచించింది, నగరంలోని చాలా బార్‌ అండ్‌ రెస్టారెంట్, క్లబుల్లో ధూమపానం చేయడం సాధారణం. టీ దుకాణాల ముందు పొగరాయుళ్లు సిగరెట్‌ తాగుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ షరా మామూలుగా కొనసాగుతోంది. ఇకపై కేటాయించిన స్మోకింగ్‌ జోన్లలో మాత్రమే సిగరెట్లు తాగాలి.  ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామని బీబీఎంపీ హెచ్చరించింది. 

>
మరిన్ని వార్తలు