నెలమంగలలో వింత బిచ్చగాడు..

3 Dec, 2019 10:34 IST|Sakshi

నెలమంగలలో వింత బిచ్చగాడు

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఏంటీ డబ్బులు ఇవ్వవా... అయితే బండెలా కదులుతుందో చూస్తా...నన్ను దాటుకుని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు తెలుసా... ఇది ఏ రౌడీనో, ట్రాఫిక్‌ పోలీసో చేసిన హెచ్చరికలు కావు...నెలమంగలలో ఒక బిచ్చగాడు చేస్తున్న హంగామా ఇది. నెలమంగల పట్టణంలో కేఈబీ ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో గత కొన్ని రోజులుగా తాగుబోతు కం బిచ్చగాడు అయిన ఒక వ్యక్తి కార్లకు, ఇతర వాహనాలకు అడ్డంపడి డబ్బులు డిమాండు చేస్తున్నాడు.

డబ్బులు ఇవ్వనిదే వాహనం కదలడానికి వీల్లేదని రోడ్డుమీదే అడ్డంగా పడుకుంటున్నాడు. కొందరు ఎందుకొచ్చిన గొడవ అని డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. అయితే రోజూ అదే రోడ్డులో తిరిగే వాహనదారులకు ఈ వ్యక్తి పెద్ద సమస్యగా మారాడు. కార్లలో వచ్చేవారు మినిమమ్‌ వంద రూపాయలు ఇవ్వాలని పట్టుబడతాడు. చిల్లర ముట్టుకోవడం లేదు. గంజాయి, వైట్నర్‌ తీసుకోవడం వల్ల ఈ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడక ముందే ఆ వ్యక్తిని పట్టుకుని ఏదైనా ఆశ్రమానికి తరలించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా