వివాహ ప్రక్రియలో నూతన ఒరవడి

15 Feb, 2020 13:04 IST|Sakshi
అరుంధతి నక్షత్రాన్ని చూసే ముందు మొక్క నాటుతున్న నవ దంపతులు

పెరంబూరు: వివాహ వేడుకలోనూ పర్యావరణంపై తమ మక్కువ చాటుకున్నారో నవ దంపతులు. శుక్రవారం పెళ్లి చేసుకున్న ముత్యాల నవీన్, శ్రీజ జంట ఆ వేడుకలోనే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని వివాహతంతులో అరుంధతి నక్షత్రాన్ని చూపించే సమయంలో ఎవెన్యూ ప్లాంట్‌ను నాటి, దాని సంరక్షణ బాధ్యతను చేపట్టడంతో పాటు, ఇదే విధంగా ప్రతి వార్షికోత్సవానికి ఒక మొక్క నాటి దాన్ని సంరక్షణా బాధ్యతలు చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం స్కాప్స్‌(హైదరాబాద్‌) స్వచ్ఛంద సంస్థ అధినేత ముత్యాల నరేంద్ర ఆధ్వర్యంలో బంధుమిత్రల సమక్షంలో పాలవాక్కమ్‌లోని గ్రీన్‌మెడాస్‌ రిసార్ట్స్‌తో జరిగింది. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా