ప్రజలే దైవాలు

21 Feb, 2018 15:57 IST|Sakshi
బిజేపూర్‌ ప్రచార సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలు

ప్రజల చెంతకే బీజేడీ పాలన

బిజేపూర్‌ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం నవీన్‌

సాక్షి, బరంపురం : ఒడిశా రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలే తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తూ ప్రజల మద్దతుతో బీజేడీ 17 ఏళ్లుగా అధికారం చేపడుతూ వివిధ ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేసిందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. బీజేపూర్‌ ఉపఎన్నికలో బీజేడీ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మంగళవారం నియోజకవర్గంలో బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజేపూర్‌లో బీజేడీ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో   ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ ఒడిశాలో గడిచిన 17 ఏళ్ల బీజేడీ పాలనలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నట్లు చెప్పారు. మనిషి పుట్టిననాడు  మమత యోజన నుంచి మనిషి మరణించిన నాడు హరిశ్చంద్ర పథకం వరకు అమలు చేసి ప్రజల వద్దకు పాలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. బీజేపూర్‌ ఉప ఎన్నికలో   బీజేడీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి రీతా సాహును శంఖం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వేలాదిమంది జనం పాల్గొన్నారు.

 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా