రహదారి విషయంలో ఘర్షణ

22 May, 2015 23:31 IST|Sakshi
రహదారి విషయంలో ఘర్షణ

- దాపోడి- భోపఖేల్‌గావ్ రోడ్డును మూసేనిన సీఎంఈ
- 2 కి.మీ. దూరం కాస్తా 15 కి.మీ. పెరిగిన వైనం
- రహదారిని తెరవాలంటూ కాలేజీ వద్ద ఆందోళన
- పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీచార్జి
సాక్షి, ముంబై:
పుణే దాపోడిలోని ‘మిలటరీ ఇంజనీరింగ్ కాలేజీ (సీఎంఈ) పరిధిలో ఉన్న రహదారిని మూసివేయడంతో జరిగిన అల్లర్ల అనంతరం భోపఖేల్‌గావ్‌లో శుక్రవారం 144 సెక్షన్ విధించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 76 మంది మహిళలతో సహా మొత్తం 189 మందిని అరెస్టు చేశారు. మరో 800 మంది గ్రామస్థులపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... దాపోడి-భోపఖేల్‌గావ్ రహదారిని సీఎంఈ యాజమాన్యం మూసి వేసింది. ఈ రహదారిని తెరవాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై గురువారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దాపోడి, బోపఖేల్‌గావ్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. చుట్టుపక్కల ఎక్కడా దుకాణాలు తెరవనివ్వలేదు. ప్రజలను కూడా ఎక్కడా బయట తిరగనివ్వలేదు.

ఎలా మొదలైందంటే..
బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు మిలటరీ ఇంజనీరింగ్ కాలేజీ పరిధిలోని భోపఖేల్‌గావ్ నుంచి దాపోడికి వెళ్లే రోడ్డు మార్గాన్ని ఎనిమిది రోజుల కిందట మూసివేశారు. దీంతో దాపోడా, భోపఖేల్‌గావ్‌ల మధ్య రెండున్నర కిలోమీటర్ల ఉన్న దూరం కాస్తా 15 కిలోమీటర్లకు పెరిగింది. దీంతో ఇరు గ్రామాల ప్రజలు 15 కిలోమీటర్ల మేర చుట్టేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆ రోడ్డు మార్గాన్ని తెరిచేందుకు ప్రయత్నించిన గ్రామస్తులు విఫలమయ్యారు. దీంతో చివరికి గురువారం గ్రామస్తులంతా కలసి మిలటరీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. అయితే గ్రామస్తుల ఆందోళన విషయం ముందే పసిగట్టిన సంబంధిత కళాశాల యాజమాన్యం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకుంది. కాలేజీ ప్రధాన ద్వారం లోపలకు చొరబడేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. వారిని లోనికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తోపులాట కాస్త ఘర్షణకు దారితీసింది. అప్పటికే రంగంలోకి దిగిన పింప్రి ఎమ్మెల్యే గౌతం చాబుక్‌స్వార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాజీవ్ జాదవ్ ప్రజలను శాంతంగా ఉండాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని పటి ్టంచుకోని ఆందోళనకారులు రహదారిని తెరవాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి ప్రారంభించారు. మహిళలు అని చూడకుండా లాఠీ ఝులిపించారు. ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. పోలీసులపై ఆందోళకారులు కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులతోపాటు సుమారు 60 మంది గ్రామస్థులకు గాయలయ్యాయి. ఇరు గ్రామాల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. 144 సెక్షన్ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
‘స్మార్ట్‌సిటీ’ ఒక్కటీ లేదు
ముంబై: స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో రాష్ట్రంలోని ఏ పట్టణానికీ చోటు దక్కలేదు. ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ గత నెలలోనే అంగీకారం తెలిపినా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువడకపోవడంతో ఇంకా ఏ పట్టణాన్ని ప్రాజెక్టులో చేర్చలేదు. ప్రాజెక్టుకు ఎంపికవ్వడానికి మొదట నగరాలను ఎంపిక చేయాలని, తర్వాత ముందుగా ఎంపికైన నగరాలతో వీటిని పోల్చి నిర్ణయం తీసుకుంటారని పట్టణాభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. దేశంలోని 100 నగరాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేస్తున్నారని, దీనికి సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేయనంత వరకు రాష్ట్రాలు నగరాలను ఎంపికచేయకూడదని ఆయన అన్నారు.  

ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లను 30 నిమిషాలలో చేరుకునే విధంగా నగరాలను తీర్చి దిద్దడం, జీవనప్రమాణాలు కల్పించడం, స్థిరమైన ఆర్థిక, ఉద్యోగావకాశాలు కల్పించడం స్మార్ట్‌సిటీల ముఖ్య ఉద్దేశమన్నారు. 2015లో 20 స్మార్ట్ సిటీలు, 2016లో 40, 2017లో 40 గుర్తించాలని కేంద్రం నిర్ణయించిందన్నా రు. మొదట ప్రతి రాష్ట్రంలో 2 లేదా 3 నగరాలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా నగరం స్మార్ట్ సిటీగా ఎంపికవ్వాలంటే.. స్వచ్ఛ భారత్ మిషన్‌లో పురోగతి ఉండాలని, మునిసిపల్ అధికారులకు సరైన సమయానికి జీతాలి వ్వాలని, విపత్తు నిర్వహణ యం త్రాం గం, స్వీయ ఆర్థిక విధానాలు కలిగి ఉండాలని, సంస్కరణలు అమలు చేయడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉండాలని చెప్పారు.

మరిన్ని వార్తలు