తీరం దాటిన నాడా తుపాను

12 Dec, 2016 15:08 IST|Sakshi
తీరం దాటిన నాడా తుపాను

చెన్నై : తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రను వణికించిన నాడా తుఫాను కారైకాల్ వద్ద శుక్రవారం ఉదయం తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కడలూరు, నాగపట్నం, పుదుచ్చేరి ప్రాంతాల్లో 4 సెం.మీ.ల మేర వర్షం పడే అవకాశముందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 50కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో కూడా తేలికపాటి వర్షాలు పడనుందని తెలిపింది. మత‍్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నాడా తుపాను తీరం దాటినప్పటకీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమిళనాడుతో పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి.

మరిన్ని వార్తలు