తమిళనాడుకు డిసెంబర్‌ గండం..?

12 Dec, 2016 14:48 IST|Sakshi
తమిళనాడుకు డిసెంబర్‌ గండం..?

చెన్నై: తమిళనాడులో డిసెంబర్‌ నెలను ఓ గండంలా భావిస్తున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఈ నెలలోనే పలు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. యాదృచ్ఛికమో ఏమో కానీ తమిళనాడు గతంలో డిసెంబర్‌ నెల​లోనే ప్రఖ్యాత నేతలను కోల్పోయింది. ఇప్పుడు మరో నేతను కోల్పోయి శోకసంద్రంలా మారింది.

అమ‍్మగా తమిళులు ఆరాధించే జయలలిత శకం ముగిసింది. డిసెంబర్‌ 5 అర్ధరాత్రి జయలలిత మరణించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జయ గురువు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ కూడా ఇదే నెలలో మరణించారు. 1987 డిసెంబర్‌ 24న ఎంజీఆర్‌ తుది శ్వాస విడిచారు. గురుశిష్యుల జీవితాలు డిసెంబర్‌లోను ముగిశాయి. భారత చివరి గవర్నర్‌ జనరల్‌ సీ రాజగోపాలచారి 1972 డిసెంబర్‌ 25న, పెరియార్‌ ఈవీ రామస్వామి 1972 డిసెంబర్‌ 24న కన‍్నుమూశారు. ఇక 2004 డిసెంబర్‌ 26న వచ్చిన సునామీ, 2015 డిసెంబర్‌లో చెన్నై, ఇతర జిల్లాలను ముంచెత్తిన వరదలు తమిళులకు పీడకలను మిగిల్చాయి.

మరిన్ని వార్తలు