మూడేళ్ల నాటి హత్య కేసులో నిందితుడి అరెస్టు

15 Feb, 2015 22:32 IST|Sakshi

న్యూఢిల్లీ: మూడేళ్ల నాటి హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో మహిళతో పెళ్లికి అడ్డంగా ఉందనే కారణంతో ప్రియురాలిని హత్య చేసి మూడేళ్లుగా నిందితుడు రామ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. తీవ్రంగా గాలించిన పోలీసులు, అతని ఆచూకీ దొరకకపోవడంతో రూ. 50,000 నగదు బహుమతి ప్రకటించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పుష్ప్ విహార్  ప్రాంతానికి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు కాపుకాసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలు.. ఉత్తరప్రదేశలోని ఘాజీపుర్‌కి చెందిన రామ్‌కుమార్ బతుకుదెరువు కోసం ఢిల్లీకి వచ్చి, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా చేరాడు.
 
 అదే సమయంలో రోహిణీ, సెక్టార్ 3లోని ఓ క్లినిక్‌లో ఉద్యోగిగా చేస్తున్న మహిళ(26)తో పరిచయం పెంచున్నాడు. గడిచే కొద్దీ ప్రేమగా మారడంతో కొంత కాలం ఆ మహిళతో చాలా చనువుగా తిరగడం మొదలుపెట్టాడు. కానీ, వేరే అమ్మాయితో పెళ్లి నిర్ణయం కావడంతో ఆమెకు దూరంగా ఉండసాగాడు. దీంతో ఆ మహిళ అతనితో తరుచుగా పెళ్లి విషయమై తరచూ గొడవ పడింది. ఈ నేపథ్యంలో 2011, డిసెంబరు నాలుగో తేదీన ఆమెను హత్య చేసి పారిపోయాడు. అప్పటి నుంచి హౌరా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ గడిపాడు. స్నేహితుణ్ని కలిసేందుకు పుష్ప్‌విహార్ ప్రాంతానికి వచ్చిన నిందితుడు అనూహ్యంగా పోలీసుల చేతికి చిక్కాడు.  
 

మరిన్ని వార్తలు