బీజేపీతో దోస్తీ యత్నం

15 Apr, 2018 07:42 IST|Sakshi

సాక్షి, చెన్నై :  బీజేపీకి దగ్గరయ్యేందుకు అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగంనేత దినకరన్‌ మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ఒకరి సాయం ద్వారా ఢిల్లీ పెద్దల మన్ననల్ని అందుకునేందుకు మంతనాల్లో ఉన్నట్టు సమాచారం. అయితే, ఢిల్లీ పెద్దలు స్పందించే పరిస్థితుల్లో లేనట్టు›తెలిసింది.అన్నాడీఎంకేని చీల్చి అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంతో చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్‌ రాజకీయంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఓ మారు బీజేపీకి దగ్గరయ్యేందుకు దినకరన్‌ ప్రయత్నాలు చేశారు. ఢిల్లీలో తిష్ట వేసి మరీ ఆయన మంతనాలు సాగించి నా ప్రయోజనం శూన్యం.

 దీంతో ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టి రాజకీయంగా ఎదిగేందుకు కుస్తీలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో  విదేశీ మారక ద్రవ్యం కేసులు, ఐటీ దాడులు దినకరన్‌ అండ్‌ బృం దాన్ని సంకట పరిస్థితుల్లోకి నెడుతున్న విషయం తెలిసిందే. చిన్నమ్మ ఫ్యామిలీ ని గురి పెట్టి సాగిన, సాగుతున్న వ్యవహారాలు కొత్త చిక్కుల్ని సృష్టిస్తుండడంతో మళ్లీ దోస్తి ప్రయత్నాల్లో పడ్డారు. కేసులు తమను చుట్టుముట్టకుండా, ఉక్కిరి బిక్కిరి చేయకుండా  ఉండే రీతి లో బీజేపీ ప్రసన్నం పొందేందుకు దినకరన్‌ తీవ్రంగానే  ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. 

అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నల్ల జెండాల ప్రదర్శనకు ప్రతి పక్షాలు పిలుపునిచ్చినా ఆయన స్పందించ లేదన్నది జగమెరిగిన సత్యం. కావేరికి వ్యతిరేకంగా తాను సాగిస్తున్న పోరాటాల్లో రాష్ట్రంలోని పళని సర్కారు మీదే తీవ్ర విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్న దినకరన్, ఎక్కడ కేంద్రాన్ని గానీ, బీజేపీని గానీ పల్లెత్తి మాట అనకపోవడం గమనార్హం. తాజా గా, ఢిల్లీలో పలుకుబడి కల్గిన రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ద్వారా రాయబారాలు సాగించి, దోస్తీ లేదా, శరణు కోరేందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. 

ఆ నేత ఢిల్లీ వెళ్లి మరీ తమ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా, స్పందన కరువైనట్టు సమాచారం. దీంతో దినకరన్‌ ఢీలాపడ్డా, తన ప్రయత్నాన్ని మాత్రం విరమించబోయే ది లేదన్నట్టు ముందుకు సాగుతున్నట్టు ఆయన మద్దతుదారులే పేర్కొంటుండ డం గమనార్హం. ఇందుకు కారణం కేసు ల విచారణలు ముగింపు దశకు వస్తుండడంతో ఎక్కడ కట కటాల పాలు కావా ల్సి ఉంటుందోనన్న బెంగ చిన్నమ్మ ఫ్యామిలీ సభ్యులు పలువుర్ని వెంటాడుతుండడమేనట.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిందెలో చిన్నారి తల

ఎవరండీ ఇంట్లో!

అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

కరోనా ఎఫెక్ట్‌: సీఎం వేతనం కట్‌!

బలాదూర్‌గా హోం క్వారంటైనీ

సినిమా

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్

కరోనా: క‌నికాకు బిగ్‌ రిలీఫ్‌