డీఎంకేకు చాన్స్‌!

25 Jun, 2017 03:00 IST|Sakshi
డీఎంకేకు చాన్స్‌!

⇔  సీఎం స్టాలిన్‌    
రజనీ కన్నా పన్నీరు మిన్న
ఎన్నికలకు ప్రజాపట్టు    
సర్వేతో వెలుగు


సాక్షి, చెన్నై:
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు వస్తే, భారీ మెజారిటీతో డీఎంకే అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అని లయోల పూర్వ విద్యార్థుల సర్వేలో తేలింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాయకుల్లో సీఎం పదవికి స్టాలిన్‌ ఒక్కరే అర్హులు అని మెజారిటీ శాతం మద్దతు పలికారు. రజనీకాంత్‌ కన్నా, పన్నీరుసెల్వం మిన్న...అని సర్వేలో తేల్చిన వాళ్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. చెన్నై లయోల కళాశాల పూర్వ విద్యార్థుల నేతృత్వంలోని సంస్కృతి సంప్రదాయ ప్రజా మండ్రం అప్పుడప్పుడు రాష్ట్రంలో సర్వేలు నిర్వహించడం జరుగుతోంది.

 ఈనెల తొమ్మిదో తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ మండ్రం నిర్వహించిన సర్వే వివరాలను శనివారం ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ కేటగిరుల్లోని ఐదు వేల 874 మంది వద్ద అభిప్రాయాలతో సర్వే సాగించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలనకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని 30.2 శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రానికి ప్రస్తుతం అన్నాడీఎంకే సర్కారు కన్నా, డీఎంకే సర్కారు అధికారంలోకి రావాలని కాంక్షిస్తూ 47 శాతం మంది మద్దతు పలికారు. ప్రజా సమస్యల పరిష్కారంలో డీఎంకే ఎప్పు డూ ముందజంలో ఉంటుందని మెజారి టీ శాతం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

స్టాలిన్‌ సీఎం: రాష్ట్రంలో సీఎం అయ్యేం దుకు అన్ని అర్హతలు ఉన్న నాయకుడు ఎవరో..? అన్న ప్రశ్నకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు 59 శాతం మంది మద్దతు ఇచ్చారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌కు 11 శాతం మంది మద్దతు ఇవ్వగా, మాజీ సీఎం, అన్నాడీఎంకే పురట్చి తలైవీ శిబిరం నేత ఓ పన్నీరు సెల్వంకు 13 శాతం మంది ఓటు వేయడం గమనార్హం.  ఇక, రజనీ కాంత్‌ జాతీయ పార్టీలో చేరి తమిళ రాజీకాయల్లోకి అడుగు పెడితే విజయం సాధిస్తారా అన్న ప్రశ్నకు ప్రసక్తే లేదని 55 శాతం మంది, సా«ధిస్తారని 33 శాతం మంది మద్దతు పలకడం గమనార్హం.

 రాష్ట్రంలో బీజేపీకి చాన్సే లేదంటూ 60 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నకు 57 శాతం మంది రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టడం గమనార్హం. సీఎం పళని స్వామి ఆ పదవిలో కొనసాగేందుకు వీలు లేదని 48 శాతం మంది వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు