​​​​​​​పాత కారులో సీఎం ప్రయాణం

20 Nov, 2023 08:36 IST|Sakshi

సాక్షి, చైన్నె: పాత జ్ఞాపకాలను నెమర వేసుకునే విధంగా సీఎం స్టాలిన్‌ ఆదివారం తన పాతకాలపు కారును స్వయంగా నడుపుకుంటూ నగర రోడ్ల మీదకు వచ్చారు. సీఎం కాన్వాయ్‌లో హఠాత్తుగా పాత కారు కనిపించడం, దానిని స్టాలిన్‌ స్వయంగా నడుపుకుంటూ వెళుతుండటం చూసిన జనం ఆ దృశ్యాలను వీడియోల రూపంలో వైరల్‌ చేశారు. సీఎం స్టాలిన్‌ కాన్వాయ్‌లో సాధారణంగా ఆధునిక హంగులతో కూడిన వాహనాలే ఉంటాయి.

ప్రత్యేక వాహనంలో ఆయన కూర్చుంటే డ్రైవర్‌ నడుపుకుంటూ వెళ్తుండటాన్ని జనం చూసి ఉన్నారు. అయితే, ఆదివారం అడయార్‌లోని పార్కులో వాకింగ్‌కు వెళ్లిన సీఎం స్టాలిన్‌ తన పాత కారును, దానితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాక స్వయంగా నడుపుకుంటూ వెళ్తుండటం, వెనుక సీటులో మంత్రులు పొన్ముడి, ఎం.సుబ్రమణియన్‌ కూర్చుని ఉండటం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు