డాక్టర్ ప్రకాష్ విడుదల

26 Apr, 2015 02:07 IST|Sakshi

 టీనగర్: వ్యభిచారం కేసులో అరెస్టయిన సెక్స్ డాక్టర్ ప్రకాష్‌ను విడుదల చేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ప్రకాష్ మహిళలను వ్యభిచారంలోకి దింపి, నీలిచిత్రాలను ఇంటర్నెట్‌లో విడుదల చేసినందున పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన విషయం తెలిసిందే. ప్రకాష్ సహా ఐదుగురిపై కేసు దాఖలైంది. డాక్టర్ ప్రకాష్ గూండా నిరోధక చట్టంలో అరెస్టయి జైలు నిర్బంధం పొందారు. వీరిపై కేసును చెన్నై ఐదవ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రాధా విచారణ జరిపి 6, ఫిబ్రవరి 2008లో తీర్పునిచ్చారు.
 
 తీర్పులో డాక్టర్ ప్రకాష్‌కు యావజ్జీవ శిక్ష, *లక్షా పదివేలు అపరాధం విధించారు.  ఈ శిక్షను వ్యతిరేకిస్తూ డాక్టర్ ప్రకాష్ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. కేసు న్యాయమూర్తులు తమిళ్‌వానన్, సిడి సెల్వం సమక్షంలో విచారణకు వచ్చింది. డాక్టర్ ప్రకాష్ తరపున సీనియర్ లాయర్ ఎ. రమేష్, లాయర్ నమో నారాయణన్, ప్రభుత్వ లాయర్ షణ్ముగ వేలాయుధం హాజరై వాదించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వివరాలు ఇలావున్నాయి. పిటిషనర్ ప్రకాష్‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ శిక్షను, *లక్షా పదివేల అపరాధాన్ని గత 2008లో విధించిందన్నారు.
 
 అప్పటి నుంచి గత 13 ఏళ్లుగా ఆయన జైలు నిర్బంధంలో వున్నారని, కోర్టు తీర్పు ఖరారు చేయబడుతోందన్నారు. అయినప్పటికీ డాక్టర్ ప్రకాష్ జైలులో వున్న కాలాన్ని శిక్షా కాలంగా పరిగణించి అతన్ని విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు విధించిన అపరాధాన్ని ఎనిమిది నెలల్లోగా చె ల్లించాలని, లేకున్నట్లయితే అపరాధ సొమ్మును చెల్లించనందుకు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో తెలిపారు.
 

మరిన్ని వార్తలు