Vijay Leo: హైకోర్టును ఆశ్రయించిన లియో మేకర్స్.. ఎందుకంటే?

16 Oct, 2023 15:18 IST|Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం లియో. ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిష నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకే ట్రైలర్‌ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మూడు రోజుల్లో సినిమా రిలీజవుతుండగా.. తాజాగా చిత్రబృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 

(ఇది చదవండి: ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి)

తమిళనాడులో సినిమా విడుదలైన మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సినిమాను ప్రదర్శించేందుకు అనుమతించాలని లియో మేకర్స్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 24 వరకు ఉదయం 7 గంటలకు లియో షోలను అనుమతించాలని నిర్మాతలు కోర్టును అభ్యర్థించారు. కాగా.. చిత్ర నిర్మాతల పిటిషన్‌పై అక్టోబర్ 17న విచారణ చేపట్టనున్నట్లు మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. 

అదనపు షోలకు అనుమతి

అయితే ఇప్పటికే లియో చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం మొదటి ఆరు రోజుల పాటు ఒక అదనపు షో ప్రదర్శనకు అనుమతి మంజూరు చేసింది. ఈ సినిమా మొదటి షోకు ప్రదర్శనకు ఉదయం 9 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే రిలీజైన లియో ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

కాగా.. 2021లో విడుదలైన మాస్టర్  తర్వాత లోకేశ్ కనగరాజ్, విజయ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం లియో. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, హెరాల్డ్ దాస్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మాయ ఎస్ కృష్ణన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్,  ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. 

(ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్‌ తల్లి)


 

మరిన్ని వార్తలు