లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన మాజీ ఆర్మీ అధికారి

15 May, 2015 00:53 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యాపారికి రూ.30 లక్షలు లంచం అడిగినందుకు ఆర్మీ మాజీ అధికారిని సీబీఐ అధికారులు గురువారం అరెస్టు చేశారు. అధికారితో పాటు వ్యాపారిని కూడా  అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖాన్ మార్కెట్‌లో వ్యాపారి వద్ద లంచం సొమ్ము నుంచి రూ.15 లక్షలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వ్యాపారిపైనున్న చీటింగ్ కేసులో సహకరించడానికి సీబీఐలో సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారి పేరు చెప్పి ఆర్మీ అధికారి అంచం డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని గురువారం కోర్టులో హాజరు పరచగా కోర్టు రెండు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించింది.
 

మరిన్ని వార్తలు